ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల కు ఇంకా ఏడాది సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నూ ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వ్యక్తిగత విషయాల పైన కూడా విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ పై, ఆయన పరిపాలన పై ప్రతిపక్ష టీడీపీ ముప్పేట దాడికి దిగింది. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో టీడీపీ ఆఫ్ లైన్ లోనూ, ఆన్ లైన్ లోనూ దాడిని మరింత ఉధృతం చేసింది.
తాజాగా సీఎం జగన్ చెప్పుల ఖర్చు ఆన్‌లైన్ లో చర్చనీయాంశంగా మారింది. జగన్ వేసుకునే చెప్పులు ఇటాలియన్ బ్రాండ్ అని చెబుతున్నారు. ఎల్‌విఎంహెచ్ కి చెందిన ఇటాలియన్ బ్రాండ్ బెర్లూటీ చెప్పుల ను జగన్ వాడుతున్నారని అంటున్నారు. సీఎం జగన్ చెప్పుల ధర 6,153 సౌదీ రియాల్స్ అని పేర్కొంటున్నారు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ.1.35 లక్షలని సమాచారం.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ చెప్పుల ఫోటోలు సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ కు గురవుతున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోపాటు ఆయన కుమారుడు లోకేష్ హిమాలయన్ వాటర్ బాటిల్స్ తాగుతున్నారని వైసీపీ ఆయనను టార్గెట్ చేసింది. ఒక్కో హిమాలయన్ వాటర్ బాటిల్ ఖరీదు వేల రూపాయల్లోనే ఉందని అప్పట్లో విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పై గతంలో వైసీపీ చేసిన ట్రోల్సును టార్గెట్ చేస్తూ ఇప్పుడు టీడీపీ శ్రేణులు జగన్ చెప్పులను టార్గెట్ చేసుకున్నారు.
నారా లోకేష్ యువ గళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వం పై, నేతలపై మాటల దాడికి దిగారు.
అయితే ముఖ్యమంత్రిని ట్రోల్ చేసే ముందు వాస్తవాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి. విమర్శలు రాజకీయంగా ఉండాలి తప్ప ఏం తింటున్నారు, ఏం వేసుకుంటున్నారు.. ఏం తాగుతున్నారు అంటూ వ్యక్తిగత విమర్శలు ఉండకూడదని చెబుతున్నారు.
అయినా జగన్ ఈ చెప్పులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వ ధనాన్ని ఏమీ వినియోగించలేదు కదా అని నెటిజన్లు, వైసీపీ కార్యకర్తలు నిలదీస్తున్నారు. ఆస్తులపరంగా పలు వ్యాపారాలు ఉన్న వ్యాపారవేత్తగా ఉన్న జగన్ చెప్పులను కూడా కొనుక్కోలేరా అని ప్రశ్నిస్తున్నారు.
అయినా టీడీపీ ఆరోపిస్తున్నట్టు ఆ చెప్పుల ధర కూడా 1.35 లక్షలు ఏమీ ఉండదని చెబుతున్నారు. ఉన్నా కూడా వేల కోట్ల రూపాయలు ఆస్తులున్న జగన్ ఆ చెప్పులు కొనుక్కోవడంలో వింతేముందని నిలదీస్తున్నారు.