తొలుత కరోనా సోకింది ఆమెకు.. ఇప్పటివరకు ఉన్న అంచనాలు తప్పా?

Update: 2021-11-20 05:10 GMT
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ ప్రపంచం మూడు..నాలుగేళ్లు వెనక్కి వెళ్లిపోయి.. ముందుకు వెళ్లటం ఆగిపోయిన ప్రత్యేక సందర్భంగా చెప్పక తప్పదు. చైనాలోని వూహాన్ మహానగరంలో మొదటిసారి కరోనాను గుర్తించటమే కాదు.. దాన్ని అరికట్టటంలో చోటు చేసుకున్న తప్పులు.. ప్రపంచం మొత్తం దాని కోరల బారిన పడేలా చేసింది.

కరోనా వైరస్ ను గుర్తించిన తొలి పేషెంట్ ఎవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సంబంధించిన లోతైన అధ్యయనం కొత్త విషయాల్ని వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా మొదటి రోగి గురించి ఉన్న అంచనాలన్ని తప్పుగా తేల్చారు. ఇంతకాలం కరోనా తొలి పేషెంట్ ఒక మహిళ అని.. అకౌంటెంట్ గా భావిస్తున్నారు.వూహాన్ కు చెందిన ఆమె కరోనా బారిన పడినట్లుగా చెప్పేవారు.

అయితే.. కరోనా తొలి రోగిని గుర్తించే విషయంలోనూ తప్పులు చోటు చేసుకున్నట్లుగా తాజా అధ్యయనంలో గుర్తించారు. ఇప్పటివరకు ఒక అకౌంటెంట్ కొవిడ్ 19 మొదటి రోగిగా అందరూ భావిస్తున్నారని.. కానీ అది తప్పుగా తేలింది. వ్యూహాన్ కు దూరంగా నివసించే ఆమెకు మొదటిసారి కరోనా వైరస్ లక్షణాలు గుర్తించినట్లుగా భావించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ విషయంలో తప్పు చేసింది.

తాజాగా నిర్వహించిన ఆధ్యయనం షాకింగ్ నిజాల్ని వెల్లడించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాల్ని జర్నల్ సైన్స్ పబ్లిష్ చేసింది. దీని ప్రకారం.. కరోనా వైరస్ మొదటిసారి మహిళ నుంచే వచ్చిందని.. ఆమె వూహాన్  హోల్ సేల్ మార్కెట్ లో ఫుడ్ అమ్మే మహిళగా గుర్తించారు. ఈమె నుంచి బయటకు వచ్చిన వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిపోయేలా చేసింది.

అంతేకాదు కొవిడ్ 19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆర్థికంగా దెబ్బ తినటమే కాదు.. దేశాలకు దేశాలు తీవ్ర ఆర్థిక.. ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొన్న దుస్థితి. 2019 డిసెంబరు 11న సీఫుడ్ అమ్మే ఒక మహిళలో కరోనా లక్షణాలు బయటపడినట్లుగా గుర్తించారు. ఆమెకు ఎలా సోకిందన్న విషయం ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News