కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో స్వైర విహారం చేస్తుంది. రోజురోజుకి భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో విషయం ఇప్పుడు అందరిని ఆందోళనకి గురిచేస్తుంది. ఈ కరోనా వైరస్ వ్యాపిస్తోన్న కొద్దీ పాజిటివ్ పేషెంట్లలో పలు రకాల లక్షణాలు బయటికొస్తున్నాయి. ఇప్పటివరకూ ప్రపంచ ఆరోగ్యసంస్థ. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ నిర్ధారించిన వాటికి భిన్నంగా ఏ లక్షణాలుంటే కరోనా పాజిటివ్ అనుకోవాలో , లేదో అర్థం కావడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి లక్షణాలు లేకున్నా కొందరికి ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా ఉండటం, మరికొందరిలో లక్షణాలున్నా నెగిటివ్ రావడం చోటుచేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులను అంచనా వేసి, వాటికి పరిష్కార మార్గాలు కనుగొనడంలో డబ్ల్యూహెచ్ ఓ, ఐసీఎంఆర్ మరింతగా కసరత్తు చేస్తున్నాయి.ప్రస్తుతం కరోనా లక్షణాలు ... కడుపులో వికారంగా ఉండటం , విపరీతంగా నీళ్ల విరేచనాలు , రోజులో ఐదారుసార్లు పైనే వాంతులు , కడుపు ఉబ్బరం, ఆహారం అరగకపోవడం , చర్మంపై దద్దుర్లు... ఇవి రోజు రోజుకూ తీవ్రమవడం. అరికాళ్లలో తిమ్మిర్లు, మూర్ఛ, నత్తిగా మాట్లాడటం
ఇప్పటి వరకు కరోనా లక్షణాలు ఇలా .. దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస తీసుకోలేక పోవడం, కళ్లలో తేడాలుంటే పాజిటివ్‌గా నిర్ధారణ చేసుకోవడం , శరీరం బలహీనంగా అనిపించడం, అలసట.. గొంతు తడారినట్టుగా ఉండి, విపరీతంగా పొడిదగ్గు.. ఊపిరితిత్తుల వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడం , శరీరానికి అవసరమైన ఆక్సిజన్ శాతాన్ని కుచించుకుపోయేలా చేయడం , కొంతమందిలో ఇన్ఫెక్షన్ ఉన్నా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం.
తాజాగా అరిచేతులు అరికాళ్లు తిమ్మిర్లుగా ఉండటం, ఫిట్స్ రావడం, నత్తిగా మాట్లాడటం వంటివి ఈ లక్షణాల్లో చేర్చారు. గత కొద్ది రోజులుగా పాజిటివ్ పేషెంట్లలో డయేరియా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత శుభ్రతలే దీనికి చికిత్సగా చెప్పుకోవాలి.