మానవత్వంలో టాటాను మించిన వారు లేరు

Update: 2021-05-25 05:30 GMT
టాటా స్టీల్ కంపెనీ గొప్ప నిర్ణయం తీసుకుంది. కోవిడ్ -19 నుండి మరణించిన తన ఉద్యోగుల కుటుంబ సభ్యులను అక్కున చేర్చుకుంది. వారికి పూర్తి భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం టాటా స్టీల్ లో కరోనాతో మరణించిన ఉద్యోగి  పూర్తి జీతం వారి కుటుంబ సభ్యులకు వారి పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాల వరకు చెల్లించడం కొనసాగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

టాటా స్టీల్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. “టాటా స్టీల్ అత్యుత్తమ సామాజిక భద్రత పథకాలు వారి కుటుంబాలకు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను నిర్ధారించడంలో సహాయపడతాయి, తద్వారా మరణించిన ఉద్యోగి  60 సంవత్సరాల వయస్సు వరకు డ్రా అయిన జీతం కుటుంబానికి చివరి వరకు లభిస్తుంది.  వైద్య ప్రయోజనాలు మరియు గృహ సౌకర్యాలతో పాటు నామినీకి ఇవన్నీ దక్కుతాయి. ” అని సంచలన ప్రకటన చేసింది.

ఉద్యోగి చివరి రిటైర్ మెంట్ అప్పుడు తీసుకునే జీతం పరిగణనలోకి తీసుకోబడుతుంది. ఈ జీతం పదవీ విరమణ వయస్సు వరకు కొనసాగుతుంది. ఈ జీతంతో పాటు, మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు వైద్య ప్రయోజనాలు మరియు నివాస సౌకర్యాలను కూడా సంస్థ అందిస్తుంది. అంతే కాదు, కంపెనీ ఉద్యోగి కోవిడ్ -19 కారణంగా మరణాన్ని ఎదుర్కొంటే గ్రాడ్యుయేషన్ వరకు వారి పిల్లల విద్య అన్ని ఖర్చులను టాటా స్టీల్ భరిస్తుందని తెలిపింది.

దేశంలోనే గొప్ప సంస్థగా పేరున్న ఈ మేరకు ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. టాటా సేవానిరతిని వేయినోళ్ల పొగుడుతున్నారు. ఇది ఒక భారతీయ సంస్థ చేసిన మొట్టమొదటిది సంచలన ప్రతిపాదనగా అభివర్ణిస్తున్నారు. దాని ఉద్యోగుల కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడంలో టాటా చూపిన చొరవకు ప్రశంసలు కురుస్తున్నాయి. 
Tags:    

Similar News