దారుణ హత్యకు గురైన కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ ఇంచార్జీ నారాయణరెడ్డి కుటుంబం ఇంకా భయం నీడలోనే తమ జీవితాన్ని గడుపుతోంది. నారాయణరెడ్డి హత్య కేసులో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నిందితులను గుర్తించడం, అరెస్టు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రియాశీలమైన చర్యలు లేకపోవడంతో నారాయణ రెడ్డి కుటంబంలో ఆందోళన పెరిగిపోతోంది. నారాయణరెడ్డి భార్య శ్రీదేవి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమకు కేఈ నుంచి ప్రాణహానీ ఉందని వాపోయారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని కేఈ కృష్ణమూర్తి చేస్తున్న అక్రమాలపై పోరాడినందుకే తన భర్తను బలితీసుకున్నారని నారాయణ రెడ్డి సతీమణి శ్రీదేవీ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త హత్యకు కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబే కారణమని ఆమె ఆరోపించారు. తమ అక్రమ దందాలకు అడ్డుపడుతున్నారని, నియోజకవర్గంలో రాజకీయంగా ఎదుతున్నారనే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆమె వాపోయారు. తన భర్తను పొట్టనపెట్టుకున్నట్లే...కేఈ కుటుంబం నుంచి తనకు కూడా ప్రాణహాని ఉందని శ్రీదేవి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ఏం జరిగినా కేఈ కృష్ణమూర్తిదే బాధ్యతని శ్రీదేవి రెడ్డి పేర్కొన్నారు. తన భర్త హత్య కేసులో సరైన చర్యలు తీసుకోవడంలో పాలకులు, పోలీసులు విఫలమయ్యారని ఆమె వాపోయారు. పోలీసులు సైతం హంతకులకు మద్దతుగా నిలుస్తున్నారని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని శ్రీదేవిరెడ్డి డిమాండ్ చేశారు.
కాగా, కేఈ మాత్రం ఈ హత్యకు తన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.తన కుటంబానికి హత్యా రాజకీయలు తెలియవని పేర్కొన్న కేఈ నారాయణరెడ్డి హత్య విషయంలో ప్రతిపక్ష వైసీపీ రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించడం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/