థియేటర్లో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం ప్రదర్శించాలని - ఆ సమయంలో ప్రేక్షకులు నిల్చోవాలని ఇటీవల సుప్రీంకోర్టు విడుదల చేసిన ఆదేశాలు కఠినంగా అమలు అవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. జాతీయ గీతం ఆలపించే సమయంలో గౌరవ సూచకంగా నిల్చోకపోవడంతో ఇద్దరు యువతులతోపాటు ఆరుగురు యువకులపై చెన్నైలో కేసు నమోదైంది. తద్వారా జాతీయ గీతాన్ని గౌరవించలేదంటూ నమోదైన మొదటి కేసుగా నిలిచిపోయింది. అంతే కాకుండా ఈ సంఘటన ప్రేక్షకుల మధ్య వివాదానికి కూడా కారణమైంది.
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం చెన్నై అశోక్ నగర్ లోని కాశీ థియేటర్ లో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతాన్ని వినిపించారు. ఈ సినిమాకు వచ్చిన వారిలో ఇద్దరు యువతులతోపాటు ఆరుగురు యువకులు లేచి నిలబడకపోగా - సెల్ఫీలు తీసుకుంటూ ఉండిపోయారు. దీంతో కొందరు వ్యక్తులు వారితో వాగ్వాదానికి దిగారు. సినిమా విరామ సమయంలో హాలు బయట కొట్టుకున్నారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను ఠాణాకు తరలించారు. జనగణమన ఆలపిస్తున్నప్పుడు నిలబడ లేదని, పైగా సెల్ఫీలు తీసుకున్నారని విజయ్ కుమార్ అనే వ్యక్తి ఆ యువతీయువకులపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిపై విచారణ చేపట్టారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/