ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డదనే సామెత లాగ అయిపోయింది బీజేపీ పరిస్థితి. ఇన్ని రోజులు మౌనంగా కూర్చుని సరిగ్గా పోలింగ్ ముందురోజు రాకేష్ తికాయత్ ఇచ్చిన పిలుపు బీజేపీ మీద పిగుడు పడినట్లయ్యింది. కేంద్రం ఆ మధ్య తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికి పైగా ఢిల్లీ శివార్లలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన విషయం తెలిసిందే. ఆ ఉద్యమం భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయు) ఆధ్వర్యంలో జరిగింది.
ఆ బీకేయుకి అగ్రనేత రాకేష్ తికాయత్. మొదటి దశ పోలింగ్ జరిగిన పశ్చిమ యూపీ ప్రాంతం వాసే ఈ తికాయత్. తికాయత్ ది ముజఫర్ నగర్ జిల్లాయే. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడిన తికాయత్ రైతుల కోసమే ఓటేయండి అని పిలుపిచ్చారు. కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా జాట్ నేత తికాయత్ చేసిన పోరాటాలు అందరికీ తెలుసు. ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ+ఆర్ఎల్డీకి మద్దతుగా జాట్లు, ముస్లింలు, యాదవులు పెద్ద ఎత్తున ఏకమయ్యారు.
తికాయత్ ఎక్కడా బీజేపీకి ఓటేయద్దని చెప్పలేదు. కానీ ఆయన పిలుపులో అర్థం మాత్రం బీజేపీకి ఓట్లేయద్దనే. అందుకనే ఆయన నన్ ఆఫ్ ది ఎబోవ్ (నోటా)కు కూడా ఓట్లేయద్దని చెప్పారు. నోటాకు ఓటు వేసి వృధా చేసుకోవద్దన్నారు. ఈయన చెప్పకపోయినా అందరికీ తెలిసిన అర్ధమేంటంటే ఎస్పీ, ఆర్ఎల్డీకి ఓట్లు వేయమనే. తికాయత్ కు జాట్లలో తిరుగులేని పట్టుంది. ఆర్ఎల్డీ ఎలాగు జాట్ల పార్టీయే. పశ్చిమ యూపిలో 128 సీట్లున్నాయి. ఇందులో మొదటి విడత 58 సీట్లకు పోలింగ్ జరిగింది.
ఈ 128 సీట్లలో బీజేపీకి గనుక దెబ్బ పడితే దీని ప్రభావం రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలపైన కూడా పడే అవకాశముంది. ఎందుకంటే జాట్లున్నది పరిమిత ప్రాంతంలోనే అయినా ముస్లింలు, యాదవులు రాష్ట్రమంతా పెద్ద సంఖ్యలో ఉన్నారు. కాబట్టి తికాయత్ పిలుపు బీజేపీపై నెగిటివ్ గా పడే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి.
మొత్తానికి ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి కామ్ గా కూర్చున్న తికాయత్ చివరి రోజున మాత్రం బీజేపీని పెద్ద దెబ్బే కొట్టాడు. మరి ఆయన ప్రభావం ఎంతగా పడిందన్నదే తేలాలి.