టీడీపీకి దెబ్బ కొట్టేలా.. జ‌గ‌న్ మంత్రివ‌ర్గ వ్యూహం

Update: 2022-04-04 08:08 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్ర‌క్రియ పూర్త‌యింది. ఇక రాజ‌కీయ వ‌ర్గాల్లో అత్యంత ఆస‌క్తిగా మారిన మంత్రివ‌ర్గ కూర్పు ఎలా ఉండ‌బోతుంద‌న్న‌ది హాట్ టాపిక్‌గా మారింది. గ‌త కొంత కాలం నుంచి మంత్రి ప‌ద‌వి ఊడేది ఎవ‌రికి? ప‌ద‌వి ద‌క్కేది ఎవ‌రికి? అంటూ చ‌ర్చ‌లు జోరుగా సాగుతున్నాయి.

ఇప్పుడిక జిల్లాల పున‌ర్విభ‌జ‌న పూర్తి కావ‌డంతో మ‌రో మూడు రోజుల్లో జ‌గ‌న్ కొత్త మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. 2024 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే ఆయ‌న మంత్రివ‌ర్గంలో దాదాపు స‌మూల మార్పులు చేయ‌బోతున్నార‌ని టాక్‌. ఒక‌రిద్ద‌ర్ని మాత్ర‌మే పాత మంత్రుల‌ను కొన‌సాగించి.. మిగ‌తా స్థానాల్లో కొత్త‌వాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వ‌బోతున్నార‌ని స‌మాచారం.

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి అధికారం కాపాడుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న జ‌గ‌న్‌.. టీడీపీని దెబ్బ‌కొట్టే వ్యూహాల‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని టాక్‌. ఇప్పుడు ఈ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ను కూడా అందుకే వాడుకుంటార‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉంటార‌ని భావిస్తున్న సామాజిక వ‌ర్గాల నుంచి ఎక్కువ మందికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చేందుకు జ‌గ‌న్ మొగ్గుచూపుతున్నార‌ని తెలిసింది.

ఈ వ్మూహంతో ఆయా సామాజిక‌వ‌ర్గాల ఓట్లు త‌న వైపు తిప్పుకుని టీడీపీకి షాక్ ఇవ్వాల‌న్న‌ది ఆయ‌న ఆలోచ‌న‌గా తెలుస్తోంది. అందుకే కొత్త మంత్రివ‌ర్గంలో దాదాపు 10 మంది బీసీ నాయ‌కులు ఉంటార‌ని స‌మాచారం. మొద‌టి నుంచి బీసీ సామాజిక వ‌ర్గం టీడీపీకి అండ‌గా ఉంది. కానీ గ‌త ఎన్నిక‌ల్లో బీసీల్లో చీలిక వ‌చ్చి ఓ వ‌ర్గం జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా నిలిచింది. ఇప్పుడు మిగిలిన బీసీల‌ను కూడా త‌న‌వైపు లాక్కునేందుకు మంత్రి ప‌ద‌వుల‌తో జ‌గ‌న్ సిద్ధ‌మయ్యార‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఎస్సీ, ఎస్టీ, క‌మ్మ సామాజిక వ‌ర్గానికి కూడా త‌గిన ప్రాధాన్య‌త క‌ల్పించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్లు తెలిసింది. ఇలా వాళ్లు మొత్తం 19 మంది మంత్రులు అవుతార‌ని అంటున్నారు. అయితే ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీల‌కు ప్రాధాన్య‌త పెంచే క్ర‌మంలో త‌న సొంత సామాజిక వ‌ర్గాన్ని జ‌గ‌న్ దూరం పెడుతున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఆ సామాజిక వ‌ర్గంలో జ‌గ‌న్‌పై అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌రి దాన్ని త‌గ్గించుకుంటూ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌యేలా జ‌గ‌న్ ఎలాంటి ప్లాన్ వేస్తారో చూడాలి. ఇక తాజా, మాజీ మంత్రుల‌కు జ‌గ‌న్ స్వ‌యంగా వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనే తీరుపై దిశానిర్దేశం చేయ‌బోతున్నారు. వేటు ప‌డ్డ మంత్రుల‌కు జిల్లా అధ్య‌క్ష బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టి పార్టీని బ‌లోపేతం చేసే ప‌ని అప్ప‌గించ‌బోతున్నారు.
Tags:    

Similar News