దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కసారిగా ఉన్నట్టుండి కేసులు పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా భయాందోళనలు నెలకొన్నాయి. సెకండ్‌వేవ్ కరోనా తొలుత మహారాష్ట్రకు మాత్రమే పరిమితమైనప్పటికీ.. ఆ తర్వాత మిగిలిన రాష్ట్రాలకు పాకుతోంది. కర్ణాటకలోనూ ఇటీవల కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో కఠిన నిబంధనలు విధిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ కఠిన నిబంధనలు అమలు చేయాలంటూ ఆలోచిస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రధాన నగరాల్లో ఆదివారం నాడు సంపూర్ణ లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. దీన్ని మరింత విస్తరించే అవకాశాలు లేకపోలేదు.
ఇదిలా ఉంటే గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 43,846 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి రావడం ఇదే తొలిసారి. 197 మంది మరణించారు. 22,956 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,15,99,130 చేరుకుంది.
ఇందులో 1,11,30,288 మంది డిశ్చార్జ్ కాగా.. 1,59,755 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,09,087కు చేరింది. యాక్టివ్ కేసులు మూడు లక్షల మార్క్‌ను అధిగమించడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటిదాకా 4,46,03,841 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
కరోనా మృతుల్లో సంఖ్యలో భారత్ ఇప్పటికే మూడో స్థానంలో కొనసాగుతూనే ఉంది.
అమెరికా - బ్రెజిల్ తరువాత ఆ స్థాయిలో మరణాలు సంభవించింది. భారత్‌లోనే. అమెరికా-5,54,871, బ్రెజిల్-2,92,856 మంది మరణించారు. భారత్ లో 1,59,755 మంది మృతి చెందారు. ఈ మూడు దేశాలతో పాటు మెక్సికో - బ్రిటన్ - ఇటలీల్లో లక్షమందికి పైగా మరణించారు. మెక్సికోలో 1,97,827, ఇటలీలో 1,04,642 మంది కరోనా కాటుకు బలి అయ్యారు. బ్రిటన్ లో ఇప్పటికే కరోనా సోకి 1,26,122 మంది మృతి చెందారు.అయితే మనదేశంలో సెకండ్ వేవ్ కరోనా ముంచుకు రావడం ఆందోళన కలిగిస్తున్నది. దీంతో వివిధ రాష్ట్రాల్లో కఠిన నిబంధనలు విధిస్తున్నారు.