ఈ మ‌ధ్యాహ్నం ఎండ చాలా డేంజ‌ర్ అట‌!

Update: 2017-04-25 06:51 GMT
తెలుగు రాష్ట్రాలే కాదు.. మ‌రెక్క‌డ ఉన్నా స‌రే.. ఈ రోజు కాస్త జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే. మీరీ రోజు ఉద‌యం నుంచి సాయంత్రం 5 గంట‌ల లోపు బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటే.. వీలైనంత‌వ‌ర‌కూ వాయిదా వేసుకోవ‌టం బెట‌ర్‌. లేదూ.. కాదూ అంటే.. ఎండ తీవ్రత ఒంటి మీద ప‌డేందుకు అవ‌కాశం ఇవ్వ‌ని రీతిలో ఏర్పాట్లు చేసుకోవ‌టం చాలా అవ‌స‌రం. ఎందుకంటే.. ఈ రోజు ఎండ మ‌హా డేంజ‌ర్ అని హెచ్చ‌రిస్తున్నారు.

ఎందుకంటే.. సూర్యుడి నుంచి వ‌చ్చే అతినీల లోహిత కిర‌ణాల తీవ్ర‌త నిత్యం ఉంటున్నా.. ఈరోజు తీవ్ర‌త మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. మామూలుగా అయితే.. సూర్య‌రశ్శి నుంచి 3 నుంచి 5 శాతం వ‌ర‌కూ బ్లూరేస్ ఉంటాయ‌ని.. కానీ.. ఈ రోజు మాత్రం అందుకు భిన్నంగా బ్లూరేస్ 11 శాతం దాటే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

వాతావ‌ర‌ణంలో వ‌చ్చిన మార్పుల కార‌ణంగా ఈ రోజు తీవ్ర‌స్థాయిలో ఉండే బ్లూరేస్ కార‌ణంగా ఆరోగ్య స‌మ‌స్య‌లు వెల్లువెత్తే వీలుంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ రోజు ఉద‌యం నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కూ వీలైనంత‌వ‌ర‌కూ ఎండ‌లోకి వెళ్ల‌క‌పోవ‌టం మంచిద‌న్న మాట‌ను చెబుతున్నారు. ఒక‌వేళ వెళ్లాల్సి వ‌స్తే.. సూర్య‌కిర‌ణాలు నేరుగా త‌గల‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం మంచిదంటున్నారు. ఈ బ్లూరేస్ కార‌ణంగా చ‌ర్మం మీద పొక్కులు వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని.. వ‌డ‌దెబ్బ బారిన కూడా ప‌డొచ్చ‌ని చెబుతున్నారు. మ‌రీ ముఖ్యంగా మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు గంట‌ల మ‌ధ్య‌లో మాత్రం ఎంతో అవ‌స‌ర‌మైతే త‌ప్పించి బ‌య‌ట‌కు రావొద్ద‌న్న‌ది నిపుణుల మాట‌. సో.. బీకేర్ ఫుల్‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News