బాబు మాట‌ను టోల్ గేట్ వాళ్లు లెక్క చేయ‌రా?

Update: 2015-07-19 09:59 GMT
గోదావ‌రి పుష్క‌రాల సంద‌ర్భంగా విప‌రీత‌మైన ర‌ద్దీతో ర‌హ‌దారుల‌న్నీ కిట‌కిట‌లాడుతున్న నేప‌థ్యంలో.. ఏపీలోని రాజ‌మండ్రి వైపు వెళుతున్న వాహ‌నాల నుంచి టోల్ గేట్ ఫీజు వ‌సూలు చేయొద్ద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆదేశాలు జారీ చేయ‌టం తెలిసిందే.

వాస్త‌వానికి ఇలాంటి ఆదేశాల్నే.. శ‌నివారం ఉద‌యం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ జారీ చేశారు. భారీగా వాహ‌నాలు త‌ర‌లి వ‌స్తున్న నేప‌థ్యంలో.. టోల్ గేట్ ఛార్జీల‌ కార‌ణంగా కిలోమీట‌ర్ల మేర ట్రాఫిక్ ఆగిపోవ‌టంతో.. టోల్ గేట్ చార్జీలు వ‌సూలు చేయొద్ద‌ని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ నోటి నుంచి మ‌ట వ‌చ్చిన వెంట‌నే.. టోల్ గేట్ ఛార్జీల వ‌సూళ్లు ఆగిపోయింది.

ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఏపీలో మాత్రం ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. టోల్ గేట్ ఛార్జీలు వ‌సూలు చేయొద్ద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స్వ‌యంగా ఆదేశించినా ఆ మాట‌ను టోల్ గేట్ సిబ్బంది పట్టించుకోవ‌టం లేదు.త‌మ‌కు రాత‌పూర్వ‌కంగా ఆదేశాలు అంద‌లేద‌ని.. చార్జీలు చెల్లించాల్సిందేనంటూ ప‌ట్టుబుడుతున్న దుస్థితి.
దీంతో.. భ‌క్తుల్లో అయోమ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి నోటి నుంచి వ‌చ్చిన మాట‌ను. అధికారులు రాత‌పూర్వ‌కంగా ఎందుకు పంప‌లేద‌న్న ప్ర‌శ్న ఒక‌టైతే.. ప్ర‌త్యేక సంద‌ర్భంలో ముఖ్య‌మంత్రి తీసుకున్న నిర్ణ‌యాన్ని అమ‌లు చేయ‌టానికి ఒక‌టిన్న‌ర రోజులు ప‌ట్ట‌టం ప‌లు సందేహాల‌కు తావిస్తోంది. బాబు మాట‌ను టోల్ గేట్ వాళ్లు కూడా ప‌ట్టించుకోరా? అంటూ కొంద‌ర వ్యంగ్యంగా విమ‌ర్శ‌లు చేయ‌టం క‌నిపిస్తోంది. ఇప్ప‌టికైనా బాబు మ‌రోసారి రియాక్ట్ అయితే బాగుండు. త‌న ఆదేశాల్ని అమ‌లు చేయ‌ని వారిపై ఇప్ప‌టికైనా ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారో..? లేదో..?
Tags:    

Similar News