ఇండియా; ఫైర్‌, పోలీస్‌, అంబులెన్స్‌... 112

Update: 2015-04-07 12:39 GMT
ఇక ఇండియాకు కూడా సింగిల్‌ ఎమర్జెన్సీ నెంబరు వచ్చేసింది. ఇప్పటికీ పోలీసులకు ఒకటి, అగ్నిమాపక సిబ్బందికి ఒకటి.. ఆస్పత్రికి ఒకటిగా ఉన్న నెంబరు...ఇక నుంచి అందరికీ ఒకటే! అమెరికాలో 911 అనేది ప్రతి నిత్యం ప్రతినోటా నానే నెంబరు. ఎనీ ఎమర్జెన్సీ 911. ప్రస్తుతం ఇండియాకు కూడా సింగిల్‌ ఎమర్జెన్సీ నెంబరు లేదా ఆల్‌ ఇన్‌ వన్‌ ఎమర్జన్సీ (ఉమ్మడి అత్యవసర సంఖ్య) వచ్చేసింది. ఈమేరకు 112 ను ట్రాయ్‌ భారతదేశపు అత్యవసర నెంబరుగా పత్రిపాదన పెట్టింది.

ఇక నుంచి 100, 101, 102, 108 లు ఉండవు. దేనికైనా 112 నే వాడాల్సి ఉంటుంది. దీనిని విస్తృతంగా ప్రచారం చేయడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, కొత్త నెంబరు పూర్తిగా అందరికీ అలవాటయ్యే వరకు పాత నెంబర్లకు చేసిన కాల్స్‌ కూడా 112 కు రీడైరెక్ట్‌ అవుతాయి.

ఏ ఫోన్‌ నుంచి చేసినా ఈ నెంబరు పనిచేస్తుంది. అవుట్‌ గోయింగ్‌ కాల్‌ డిబార్‌ అయిన ఫోన్‌ నుంచి కూడా దీనికి కాల్స్‌ వెళ్తాయి
Tags:    

Similar News