ఆ గుడిలో భారీ గుప్త‌నిధి!

Update: 2015-11-05 09:13 GMT
పురాత‌న దేవాల‌యాల్లో గుప్త నిధుల‌ను దాచ‌య‌టం కొత్త విష‌య‌మేమీ కాదు. కానీ.. వీటికి సంబంధించి కొత్త‌గా వివ‌రాలు బ‌య‌ట‌కు రావ‌ట‌మే విశేషం. అలాంటి భారీ గుప్త నిధి ఒక దేవాల‌యంలో ఉంద‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌మిళ‌నాడుకు చెందిన ఒక దేవాల‌యంలో రెండు గ‌దుల నిండా గుప్త‌నిధులు ఉన్న‌ట్లుగా చెబుతున్న వార్త‌లు ఇప్పుడు అంద‌రిలో ఆస‌క్తిని రేకె్త్తిస్తున్నాయి.

కొద్ది నెల‌ల క్రితం కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురంలోని ప‌ద్మ‌నాభ దేవాల‌యంలో భారీగా గుప్త‌నిధులు ఉన్న విష‌యం బ‌య‌ట‌కు రావ‌ట‌మే కాదు.. కొన్ని వేల కోట్ల రూపాయిల బంగారం ఉన్న‌ట్లుగా గుర్తించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మ‌రో ర‌హ‌స్య గ‌దిని తెర‌వాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. నాగ‌బంధ‌నం కార‌ణంగా ఆ గ‌దిని ప్ర‌స్తుతానికి తెర‌వ‌కుండా ఉంచారు.

ఇదిలా ఉంటే.. తాజాగా త‌మిళ‌నాడులోని తిరువారూర్ జిల్లాలోని త్యాగ‌రాజ‌స్వామి ఆల‌యంలో రెండు గ‌దుల్లో గుప్త‌నిధులు ఉన్న‌ట్లుగా తాజాగా బ‌య‌ట‌ప‌డింది. అక్క‌డి శిలాప‌ల‌కాలు ఆ విష‌యాన్ని వెల్ల‌డిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఈ చారిత్ర‌క త్యాగ‌రాజ‌స్వామి ఆల‌యంలో ఉన్న ర‌థం ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌దిగా గుర్తింపు ఉంది.

ఈ నెల 8న ఆల‌యానికి కుంభాబిషేకం జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఆలయంలో రెండు ర‌హ‌స్య గ‌దుల్లోగుప్త నిధులు ఉన్న‌ట్లుగా స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వాటిని తెరిచి చూడాల్సిందిగా ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు. మ‌రోవైపు.. ఈ గుప్త నిధికి సంబంధించి పురావ‌స్తు ప‌రిశోధ‌కుల్లో ఒక‌రైన డాక్ట‌ర్ బాల‌సుబ్ర‌మ‌ణి సైతం పురాత‌న శాస‌నాల ప్ర‌కారం ఆల‌యంలో రెండు ర‌హ‌స్య గ‌దుల్లో గుప్త‌నిధులు ఉన్న‌ట్లుగా చెప్పుకొచ్చారు. మ‌రి.. ఇందులో ఉన్న విలువైన వ‌స్తువులు ఏమిట‌న్న‌ది తెలియాలంటే.. ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవాల్సిందే.
Tags:    

Similar News