తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు.. రెచ్చిపోయాడు. ఓ మహిళపై వికృతంగా ప్రవర్తించాడు. న్యూడ్ కాల్స్ చేయడంతోపాటు.. ఆమెతో అసభ్యంగా మాట్లాడడం.. చివరకు గొంతు కోసే వరకు పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ విజయ్.. అర్ధరాత్రి వీరంగం సృష్టించాడు. కత్తితో ఓ వివాహిత గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.
గమనించిన కుటుంబసభ్యులు బాధితురాలిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది కావడంతో పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. ఈ విషయంపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను వివరణ కోరగా.. విజయ్ తన పీఏ కాదని.. గతంలో ఓ కార్పొరేటర్ వద్ద పని చేశాడని చెప్పడం గమనార్హం.
ఏం జరిగిందంటే..
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ విజయ్.. బాధితురాలికి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యా డు. వీరి మధ్య కొన్నాళ్లుగా.. మాటలు నడుస్తున్నాయి. తరచుగా ఫోన్లు కూడా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విజయ్..న్యూడ్ కాల్స్ చేసి ఆ మహిళను వేధించడం మొదలు పెట్టాడని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి మహిళ ఇంటికి వెళ్లి `కోరిక` తీర్చాలంటూ వేధింపులకు గురి చేయడంతో మహిళ నిరాకరించిందన్నారు.
ఆవేశంతో ఊగిపోయిన పీఏ.. బీర్ బాటిల్‌తో మహిళ తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. దీంతో ఆమె చనిపోయిందని భావించిన విజయ్.. అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే.. బాధితురాలి బంధువులు ఆమెను ఆసుపత్రికి చేర్చారు. కాగా, పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించి.. దర్యాప్తు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.