షర్మిలతో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే కొడుకు భేటీ..రాజకీయ వర్గాల్లో సంచలనం
ఏపీ సీఎం జగన్ సోదరి.. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అధికార పార్టీ నాయకులు ఇప్పటికే షర్మిల ఎవరు.. ఇక్కడ పార్టీ పెట్టాలంటే.. తెలంగాణ వారికే హక్కు ఉంది.. సీమకు చెందిన షర్మిల.. అక్కడే పార్టీ పెట్టుకోవాలి.. అంటూ.. నానా కామెంట్లు చేసి.. రచ్చ చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. ఇప్పుడు ఇదే అధికార పార్టీ నేతలకు పెద్ద షాక్ తగలనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని పుంజుకునేలా చేసేందుకు షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే జిల్లాల నాయకులతో భేటీ అవుతున్నారు. ప్రజల నాడిని తెలుసుకుంటున్నారు. రోజుకో.. జిల్లా నుంచి నాయకులను ఆహ్వానించి.. వారితో సుదీర్ఘ చర్చలు నడుపుతున్నారు. అవసరం అనుకున్న నాయ కులను మళ్లీ మరుసటి రోజు కూడా పిలిపించుకుని.. ఆ జిల్లాపై పరిస్థితిని వాకబు చేస్తున్నారు. అదేసమ యంలో రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు ఉన్న ఎడ్జ్‌ను కూడా పరిశీలిస్తున్నారు. ఇలా మొత్తంగా షర్మిల నిత్యం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా.. అధికార టీఆర్ ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు.. షర్మిలతో భేటీ కావడం స ర్వత్రా చర్చకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య. ఆది నుంచి పార్టీలో ఉన్నయాదయ్యకు తెలంగాణ ఉద్యమంతో మంచి సంబంధం ఉంది. అయితే.. అనూహ్యంగా ఆయన కుమారుడు కాలే రవికాంత్.. షర్మిలతో లోటస్ పాండ్‌లో భేటీ అయ్యారు. అయితే.. ఏయే విషయాలు చర్చకు వచ్చాయి?
అసలు అధికార పార్టీ ఎమ్మెల్యేకు షర్మిలతో భేటీ కావాల్సిన అవసరం ఏంటి? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. రేపు రవికాంత్ కనుక షర్మిలకు జై కొడితే.. టీఆర్ ఎస్ నేతలు ఏం సమాధానం చెబుతారనేది కూడా ఆశ్చర్యకరంగాను ఆసక్తిగాను మారడం గమనార్హం. అసలు ఏం జరిగిందనే విషయం తెలియాలంటే.. కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.