మోడీ సర్కారు మీద టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చను మొదలు పెట్టిన సందర్భంగా.. తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన పార్టీ తరఫున టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగించారు. రాష్ట్ర విభజనను పదే పదే ప్రస్తావించిన ఆయన.. అశాస్త్రీయంగా.. బుల్ డోజ్ చేసేలా రాష్ట్ర విభజనను చేపట్టారన్నారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో అన్ని ఉండగా.. పాత రాష్ట్రంగా ఉన్న ఏపీలో ఏమీ లేకుండా పోయాయన్నారు.
విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఏపీనే అన్న గల్లా.. ఏపీకి రాజధాని లేదని..ఆదాయం లోటు ఉందన్నారు. ఏపీ అనిశ్చితిలో ఉందన్నారు. మందబలంతో.. వివక్షతతో.. అన్యాయంగా గొంతునొక్కి విభజన బిల్లు పాస్ చేశారని ఆయన తీవ్రస్వరంతో మండిపడ్డారు.
దీనిపై టీఆర్ఎస్ ఎంపీలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గల్లా వ్యాఖ్యల్ని తప్పు పట్టారు.ఈ సందర్భంగా వారు గల్లా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గులాబీ ఎంపీల ఆగ్రహంపై స్పందించిన స్పీకర్.. మీ వంతు వచ్చినప్పుడు మీరు చెప్పాల్సింది మొత్తం చెప్పండంటూ సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా.. గులాబీ ఎంపీలు తమ అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
ఈ సందర్భంగా తన వ్యాఖ్యలపై స్పందించిన గల్లా జయదేవ్.. పార్లమెంటు తలుపులు మూసి.. టీవీలో లైవ్ లు కట్ చేయటం సరైన పద్ధతేనా? అంటూ ప్రశ్నించటం కనిపించింది. తెలంగాణకు ఆస్తులు ఇచ్చి.. ఏపీకి మాత్రం అప్పులు ఇచ్చారన్న వ్యాఖ్యలపైనా టీఆర్ ఎస్ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు.. తమకు మద్దతుగా నిలవాలంటూ టీఆర్ ఎస్ ఎంపీలను టీడీపీ ఎంపీలు కోరటం కనిపించింది. స్పీకర్ జోక్యంతో పాటు.. ఆమెస్వరం పెంచి మీ.. మీ స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలన్న మాటతో గులాబీ ఎంపీలు కాస్త తగ్గారు. వారికి తాను కావాల్సినంత సమయం ఇస్తానని.. అప్పుడు చెప్పాల్సినవన్నీ చెప్పొచ్చంటూ బుజ్జగించారు.