ఫుల్ క్లారిటీ: కొత్త పార్టీ కాదు.. ఉన్న పార్టీ పేరును మారుస్తున్నారంతే

Update: 2022-10-03 04:11 GMT
గడిచిన కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన సీఎం కేసీఆర్ జాతీయ పార్టీకి సంబంధించిన కీలక అంశాలు బయటకు వచ్చాయి. ఇప్పటివరకు అనుకుంటున్నట్లు కాకుండా.. జాతీయ పార్టీ మీద ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయన్న విషయాలు బయటకు వచ్చాయి.

దీని ప్రకారం కేసీఆర్ కొత్త పార్టీ పెట్టటం లేదన్న స్పష్టత తాజాగా వచ్చింది. మరో రెండు రోజుల్లో మీడియా ముందుకు వచ్చి.. తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అనుకుంటున్నట్లుగా కొత్త పార్టీ ఏర్పాటు చేయటం లేదన్న స్పష్టత వచ్చింది.

ఇప్పటికే ఉన్న టీఆర్ఎస్ కు బదులు మరో పార్టీని ఏర్పాటు చేసే ఆలోచన లేదని చెబుతున్నారు. దాని స్థానే ఉన్న ఇప్పటికే ఉన్న టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) స్థానే.. పేరును మాత్రమే మార్చనున్నారు.

కొత్త పార్టీ పెడితే.. ఎన్నికల గుర్తు మొదలు.. పలు సాంకేతిక సమస్యలు వచ్చే వీలుందని.. అందుకే అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా.. ఇప్పటికే ఉన్న పార్టీ పేరును మార్చేస్తూ నిర్ణయం తీసుకోనున్నారు.

ఇప్పటివరకు ఉన్న టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పుడున్న పార్టీని జాతీయ రాజకీయాల్లో ప్రవేశించేలా టెక్నికల్ గా ఎలాంటి చిక్కులు రాకుండా చూసుకునే లక్ష్యంగా తాజా నిర్ణయం తీసుకోనున్నారు.

పార్టీ పేరు మారిస్తే.. జెండా.. ఎన్నికల గుర్తు లాంటి ఇబ్బందుల్ని ఎదురు కావని చెబుతున్నారు. మొత్తంగా ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి భిన్నంగా పార్టీ పేరను మార్చేస్తున్న వైనం బయటకు వచ్చింది. మీడియా మీట్  సందర్భంగా మరెన్ని అంశాలు కొత్తగా బయటకు రావొచ్చన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News