అమెరికాలో జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు షాకిస్తున్నాయి. ప్రతినిధుల సభ(హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో డెమోక్రాట్లు మెజార్టీ సాధించే దిశగా దూసుకు వెళ్తున్నారు. మరోవైపు - సెనేట్ లో రిపబ్లికన్ పార్టీ హవా కొనసాగిస్తోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం రిపబ్లికన్లకు పట్టున్న చాలా స్థానాలను డెమోక్రాట్లు కైవసం చేసుకున్నారు. మరో 23 స్థానాల్లో గెలిస్తే .... ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు మెజారిటీ సాధిస్తారు. వర్జీనియా - ఫ్లోరిడా - పెన్సీల్వేనియా - కొలొరాడో లాంటి స్వింగ్ స్టేట్స్ లో రిపబ్లికన్లపై డెమోక్రాట్లు విజయం సాధించారు. మరోవైపు - సెనేట్ రిపబ్లికన్నుల సత్తా చాటుతున్నారు. ఇండియానా - నార్త్ డకోటా స్థానాల్లో డెమోక్రాట్లపై రిపబ్లికన్లు గెలుపొందారు. కీలకమైన టెక్సాస్ స్థానంలో రిపబ్లికన్ అభ్యర్థి టెడ్ క్రుజ్ విజయం సాధించారు.
రిప్రజెంటేటివ్స్ హౌస్ - సెనేట్ ను కలిపి అమెరికా `కాంగ్రెస్`గా పిలుస్తారన్న సంగతి తెలిసిందే. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 435 స్థానాలకు - సెనేట్ లోని మొత్తం 100 స్థానాల్లో 35 సీట్లకు పోలింగ్ జరిగింది. 36 రాష్ట్రాలకు గవర్నర్ పదవులకు - ఇతర పలురకాల పదవులకు కూడా ఎన్నికలు జరిగాయి. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పోలింగ్ శాతం నమోదైందని తెలుస్తోంది. న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియా దాకా - ఇటు మిస్సోరీ నుంచి జార్జియా దాకా అమెరికన్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటీపడ్డారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో అత్యధిక స్థానాలు సొంతం చేసుకోవడంతో ట్రంప్ కు షాక్ తగిలింది. ఇక నుంచి డెమోక్రాట్లు ...ట్రంప్ ప్రవేశపెట్టే చట్టాలను అడ్డుకోవచ్చు. ట్రంప్ ముందరి కాళ్లకు డెమోక్రాట్లు బంధనాలు వేసే అవకాశముంది. ట్రంప్ ఆర్ధిక వ్యవహారాలు - వ్యాపారాలతో పాటు - 2016 ఎన్నికల్లో రష్యా జోక్యం పైనా దర్యాప్తు కోరవచ్చు. అవసరమైతే - ట్రంప్ పై అభిశంసన కూడా ప్రవేశపెట్టవచ్చు.