భారతీయులకు మరో షాకింగ్ వార్త తెరమీదకు వచ్చింది. అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వెళ్లిన భారతీయ నిపుణులకు ఇటీవలి కాలంలో తీపి - చేదు వార్తలను అందిస్తున్న అమెరికా ఈ క్రమంలో మరింత షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అందజేసే హెచ్-4 వీసా నిబంధనల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని షాకింగ్ వార్తను తెరమీదకు తెచ్చింది. హెచ్-4 వీసా నిబంధనను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు ట్రంప్ సర్కారులో కీలక స్థానంలో ఉన్న అధికారులను ఉటంకిస్తూ..అమెరికా మీడియా పలు కథనాలను వెల్లడించింది.
హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్-4 వీసాదారులకు వర్క్ పర్మిట్లను కల్పిస్తూ ఒబామా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా దానికి ముగింపు పలుకాలని ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు ఇటీవల కథనాలు వెలువడ్డాయి. ఒకవేళ అటువంటి నిర్ణయం ప్రకటిస్తే హెచ్-4 వీసా కలిగిన 70 వేల మంది భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా భారతీయులకు నష్టం కలిగించే ఇటువంటి నిర్ణయం తీసుకోకుండా కేంద్రం అమెరికాపై ఒత్తిడి తెచ్చింది. ఇవి కొలిక్కి వస్తున్నట్లుగా ఇటీవల పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత్-అమెరికా మధ్య ఉన్నత విద్యా సంబంధాలను బలోపేతం చేసే ఉద్దేశంతో అమెరికా మిషన్ ఆధ్వర్యంలో విద్యార్థి వీసా దినోత్సవం కార్యక్రమాన్ని ఢిల్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా మిషన్ డిప్యూటీ చీఫ్ కార్ల్ సన్ మాట్లాడుతూ హెచ్-1బీ వీసా కార్యక్రమంలో పెద్దగా మార్పులు ఉండబోవని, అలాగే హెచ్-4లో కూడా కొత్తగా అమలు చేసేది ఏమీలేదని వెల్లడించారు.
ఈ పరిణామంతో భారతీయ నిపుణులు ఊపిరి పీల్చుకుంటుండగా తాజాగా పిడుగులాంటి వార్త తెరమీదకు వచ్చింది. హెచ్-4 వీసాదారులను తొలగించి స్థానికులకు పెద్దపీట వేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రతినిధి మైఖేల్ బార్స్ తెలిపారు. వీసా నిబంధనల్లో మార్పులు చేయాలని ట్రంప్ పరిపాలనాధికారులు ఆలోచిస్తున్నారని - అదేవిధంగా ఉద్యోగ కల్పనపై సమీక్షిస్తున్నారని ఆయన సంచలన వార్తను వెల్లడించారు. అయితే, హెచ్-4 వీసా తొలగింపు అంశం అనేది ఇంకా తుది దశకు చేరుకోలేదని - ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పారు.