బాక్సింగ్ వ్యాఖ్యాతగా ట్రంప్.. కొడుకుతో కలిసి కామెంటరీ !

Update: 2021-09-10 05:38 GMT
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. సెప్టెంబర్‌ 11న జరుగనున్న బాక్సింగ్‌ పోటీలకు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. మాజీ హెవీవెయిట్‌ ఛాంపియన్‌ ఇవాండర్‌ హోలీఫీల్డ్‌, మాజీ యూఎఫ్‌ సీ ఛాంపియన్‌ విక్టర్‌ బెల్‌ ఫోర్ట్‌ మధ్య జరుగనున్న బాక్సింగ్‌ పోటీకి తనయుడు జూనియర్‌ ట్రంప్‌ తో కలసి వ్యాఖ్యానం చేయనున్నాడు. ఈ పోటీకి ఫ్లోరిడాలోని హాలీవుడ్‌ ఎరీనా వేదిక కానుంది.

నాలుగు బౌట్ల పాటు సాగే ఈ పోటీని పే పర్‌ వ్యూ విధానం ద్వారా FITE.TV ప్రసారం చేయనుంది. డొనాల్డ్ ట్రంప్, ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. అన్నింటిలోనూ కూడా 'నా రూటే సెపరేటు' అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తుంటారు. అదే రీతిలో ఇప్పుడు కామెంటేటర్ గా ఆయన మనకు దర్శనం ఇవ్వనున్నారు. కుమారుడు జూనియర్ ట్రంప్‌ తో కలిసి ఒక బాక్సింగ్ మ్యాచ్‌ కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. హెవీవెయిట్ మాజీ ఛాంపియన్ ఇవాండర్ హోలీ ఫీల్డ్, యూఎఫ్‌సీ మాజీ ఛాంపియన్ విక్టర్ బెల్‌ఫోర్ట్ మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఫ్లోరిడాలోని హాలీవుడ్ ఎరీనా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

ఈ క్రమంలో తను వ్యాఖ్యాతగా ఉన్న ఈ మ్యాచ్‌ను ఎవరూ మిస్ కావొద్దంటూ ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. దీన్ని పే ఫర్ వ్యూ విధానంలో FITE.TVలో ప్రసారం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ చూడాలంటే మాత్రం 49.9 డాలర్లు చెల్లించి సబ్‌ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. బాక్సింగ్ రంగంలో దిగ్గజాలు పోటీ పడే ఈ మ్యాచ్ కోసం అమెరికన్లు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా, బాక్సింగ్‌ తో ట్రంప్‌ కు బాగానే అనుబంధం ఉంది. గతంలో కొంతకాలం ఆయన కొన్ని బాక్సింగ్ మ్యాచ్‌ లకు ఆతిథ్యమిచ్చారు. వీటిలో చాలావరకూ అట్లాంటిక్ సిటీలో ఉన్న ట్రంప్ సొంత కేసినోలోనే జరిగేవి. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఎవ్వరూ మిస్‌ కావొద్దంటూ ట్రంప్‌ ప్రకటనలు కూడా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే, ట్రంప్‌కు బాక్సింగ్‌తో అనుబంధం ఎక్కువే. గతంలో కొన్నేళ్లు అతను బాక్సింగ్‌ పోటీలకు ఆతిథ్యమిచ్చాడు.


Tags:    

Similar News