అమెరికాలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. సగటున రోజుకు 70వేల కేసులు నమోదవుతున్నాయి. వరుసగా మూడో రోజు 1000కి పైగా మరణాలు దేశంలో సంభవించాయి. అమెరికాలో ఇప్పటికే 40లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. 1.4లక్షల మరణాలు సంభవించాయి.
అందుకే ట్రంప్ ప్రభుత్వం ముందస్తుగా వచ్చే ఫైజర్-బయో ఎంటెక్ టీకా కోసం 1.95 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టి ఏకంగా 100 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ ను ముందస్తుగా బుక్ చేసింది. డిసెంబర్ నాటికి ఇది వచ్చే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ వస్తే తాను మొదట తీసుకుంటే అమెరికా ప్రజలంతా నన్ను స్వార్థపరుడు అంటూ తిడుతారని.. అందరికంటే ముందే తీసుకున్నాడని అంటారని ట్రంప్ తెలిపారు.
ఇక ఒకవేళ చివర్లో తీసుకున్నా.. వ్యాక్సిన్ సరిగా పనిచేయదనుకొని ఆఖరున తీసుకున్నాడని అంటారని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏం చేసినా తప్పు పట్టడం అమెరికాలో కామన్ అయిపోయిందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.