హైదరాబాద్ లో మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. ఎలా జరుగుతున్నాయో.. ఎప్పుడు జరుగుతున్నాయో తెలియదు కానీ.. వరుసగా అమ్మాయిలు మాయం కావడం తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తోంది.
తాజాగా హైదరాబాద్ లో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇద్దరు అదృశ్యమయ్యారు. మౌలాలి హనుమాన్ నగర్ లో నివసించే దామెర్ల ప్రియాంక (25) ఈనెల 19న అదృశ్యమైంది. ఆమె ప్రైవేటు ఉద్యోగి. ప్రియాంక తల్లి దామెర్ల సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇక మరో యువతి కూడా అదృశ్యం కావడం సంచలనమైంది. మౌలాలికి చెందిన సిమ్రా సనోబర్ (20) ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. ఈ విద్యార్థిని సైతం 19న అదృశ్యమైంది. బంధువుల ఇళ్లలో వెతికిన తల్లిదండ్రులు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సోదరి హునయన్ షగుఫా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరుస మిస్సింగ్ కేసులు పోలీసులకు సవాల్ గా మారాయి. సీసీటీవీ ఫుటేజీలు పోలీసులు ఆరాతీస్తున్నారు. వారి స్నేహితులు, కాలేజీలు, పని స్థలాల్లో విచారణ జరుపుతున్నారు.