వైఎస్ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్ పై ఉండవల్లి షాకింగ్ వ్యాఖ్యలు

Update: 2022-04-16 07:30 GMT
ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఆయనకున్న వాదనా పటిమ.. విషయాల మీద అవగాహన.. ఏపీ సమస్యల మీద ఉన్నస్పష్టత అంతా ఇంతా కాదు. రాజకీయంగా ఆయన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఎంతటి విధేయుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

వైఎస్ ను విపరీతంగా అభిమానించి.. ఆరాధించే వారిలో ఆయన్ను ఒకరిగా చెబుతుంటారు. అదే సమయంలో ఉండవల్లికి వైఎస్ ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. వైఎస్ తోనూ.. ఆయన కుటుంబంతోనూ ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా చెబుతుంటారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన వైఎస్ కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధం గురించి.. వారితోఉన్న దగ్గరితనం గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఇటీవల బ్రదర్ అనిల్ తో తాను భేటీ అయిన అంశం గురించి అడిగిన ప్రశ్నలకు చాలా వివరంగా సమాధానం ఇచ్చారు. ఉండవల్లి చెప్పిన సమాధానం వింటే.. పలు సందేహాలు తీరిపోవటమే కాదు.. వైఎస్ కుటుంబంతో ఉండవల్లికి ఉన్న రిలేషన్ ఏమిటన్నది కూడా అర్థమైపోతుంది.

బ్రదర్ అనిల్ తన దగ్గర పార్టీ విషయం మీద ఎలాంటి ప్రస్తావన చేయలేదన్న ఉండవల్లి.. ‘‘ఇంటికి వస్తున్నానని అడిగారు. రమ్మన్నాను. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కలిసింది లేదు. ఈ మధ్యన విజయమ్మ మీటింగ్ పెట్టినప్పుడు కలిశాడు. విజయమ్మ మీటింగ్ అప్పుడు కలిసి.. రాజమండ్రి వచ్చినప్పుడు మీ ఇంటికి రావచ్చా? అని అడిగాడు. అదేంటి? నువ్వు రావటానికి ఏంటి? ఎప్పుడైనా రావొచ్చన్నా. ఆయన జిల్లాలు తిరుగుతున్నారు కానీ.. పొలిటికల్ గా నాతోటి ఏమీ చర్చించలేదు’’ అని చెప్పారు.

రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీలో.. వైఎస్.. ఆయన సతీమణి విజయలక్ష్మి తర్వాత.. ఇతనే నాతో కొద్దిగా బాగుంటాడు. మిగిలిన వారు పెద్దగా పరిచయాలు లేవు. జగన్మోహన్ రెడ్డి.. షర్మిలలు చూస్తే గుర్తు పడతారు కానీ.. నాకు పెద్ద క్లోజ్ నెస్ లేదు. అనిల్ మాత్రం కాస్త క్లోజ్ గా ఉంటాడు’’ అని పేర్కొన్నారు. జగన్ కు సలహాలు ఇవ్వొచ్చు కదా? అంటూ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు బదులిస్తూ.. రెండు చేతులు జోడించి... ‘జగన్ కు సలహాలు ఇవ్వటం కూడా’ అంటూ నవ్వేసి.. ఆ ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చేశారు. ఉండవల్లి తాజా మాటల్ని చూస్తే.. వైఎస్ కు అత్యంత సన్నిహితమైన ఆయనకు.. వైఎస్ కుటుంబంలో ఉన్న పరిచయం ఈ పాటిదా? అన్న భావన కలుగక మానదు.
Tags:    

Similar News