ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రధానమైన సమస్యలలో అతి ముఖ్యమైనది నిరుద్యోగం. దేశంలో ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. చదువుకునే యువత పెరిగిపోతున్నారు..కానీ , దానికి తగ్గ ఉద్యోగాలని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతుంది. ఈ సమస్య చాలా రోజులుగా భారతదేశాన్ని పట్టిపీడిస్తోంది. 2013 లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేం అధికారంలోకి వస్తే కోటి ఉద్యోగాలను కల్పిస్తాం అని అప్పటి బీజేపీ ప్రధాని అభ్యర్థి అయిన మోదీ ప్రకటించారు. ఆ తరువాత సంవత్సరం తిరక్కుండానే, భారీ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోడీ దేశ ప్రధానిగా ఎన్నికైయ్యారు. ఇక తాజాగా జరిగిన ఎన్నికలలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది, తిరిగి వరుసగా రెండోసారి మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైయ్యారు. కానీ , 2013 కి ఇప్పటికి నిరుద్యోగ సమస్య పెరుగుతూనే ఉంది కానీ , తగ్గింది మాత్రం కనిపించలేదు.
ప్రతి సంవత్సరమూ ఒక కోటీ ఇరవై లక్షల మంది కార్మికులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే ప్రతి ఏడాది ఇంజినీరింగ్ , మెడికల్ , డిగ్రీ వంటి కోర్సులు చేసినవారు లక్షల్లో బయటకి వస్తున్నారు. వారిలో 10 శాతం మందికి కూడా ఉద్యగం దొరకడంలేదు. దేశంలో కేవలం 7 శాతం మంది మాత్రమే, ఉత్తమ ప్రమాణాలున్న ఆర్థిక వ్యవస్థల్లో పనిచేస్తూ, కార్మిక ఉపకారాలు పొందుతున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ... కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ నిరుద్యోగ సమస్య మరింత తీవ్రతరం అయ్యింది. ఉద్యోగాలని సృష్టించడంలో బీజేపీ పూర్తిగా విఫలం అయ్యింది అని చెప్పవచ్చు. ఈ నిరుద్యోగ సమస్య ఇలానే కొనసాగితే బీజేపీ వచ్చే ఎన్నికలలో అధికారానికి దూరం కావడం ఖాయంగా కనిపిస్తుంది.