సడెన్ గా వైసీపీ నుంచి ఒక నిర్ణయం వెలువడింది. చూడబోతే ఇది ఎన్నికల వేళ కానే కాదు, అంత అర్జంటుగా యాత్రలు చేయడానికి అధికార పార్టీకి అవసరం అయితే లేనే లేదు అని చెప్పాలి. కానీ ఎందుకో వైసీపీ బాగా తొందర పడుతోంది. ఒక్కసారిగా గేర్ మార్చి స్పీడ్ పెంచింది కూడా.
ఈ మధ్యనే గడప గడపకు మన ప్రభుత్వం అన్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది ఎనిమిది నెలల పాటు సాగుతుంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఈ ఏడాది ఎండింగ్ దాకా గడప గడపా వైసీపీ ప్రజా ప్రతినిధులు తొక్కాల్సిందే అన్న మాట.
మరి అది స్టార్ట్ అయి గట్టిగా వారం రోజులు కూడా కాలేదు. ఈ లోగా మంత్రుల బస్సు యాత్రను వైసీపీ హై కమాండ్ తెర ముందుకు తెచ్చింది. మరి ఇది ఇపుడు అవసరమా అంటే అవసరమే అని వైసీపీలో వినిపిస్తోంది. ఎలాగంటే ఒక వైపు టీడీపీ జిల్లాల టూర్లతో జోరు చేస్తోంది. జగన్ జిల్లా టూర్లు చేస్తున్నా సరిపోవడం లేదు, పైగా ప్రభుత్వ కార్యక్రమాలుగానే వాటిని చూస్తున్నారు.
దాంతో పార్టీ తరఫున కూడా యాత్రలు ఉండాలని డిసైడ్ చేశారు అంటున్నారు. అయితే ఇక్కడ టైమింగ్ చాలా ఇంపార్టెంట్ గా ఉంది. ఎలాగంటే అదే టైమ్ లో అంటే ఈ నెల 27, 28 తేదీలలో ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నారు. ఈ మహానాడుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా జిల్లాల టూర్లు చేస్తూ పార్టీ జనాలను ఉత్సాహపరుస్తున్నారు.
ఆయన జిల్లా టూర్లకు మంది స్పందన లభిస్తోంది. దాన్ని బట్టి చూస్తే మహానాడు సూపర్ హిట్ అని తేలిపోతోంది. దాంతో ఆ ప్రభావం ఏపీ రాజకీయాల మీద పూర్తిగా పడకుండా కొంత సైడ్ చేయాలని వైసీపీ డిసైడ్ అయినట్లుగా ఉంది.
అందుకే మహానాడుకు పోటీగా మంత్రుల బస్సు యాత్రలను ముందుకు తీసుకువస్తున్నారు అంటున్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకూ ఏపీలోని అన్ని ముఖ్యపట్టణాలు, జిల్లా కేంద్రాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులతో ఈ బస్సు యాత్రలు ఉంటాయని అంటున్నారు.
ఏపీలో ఉన్నది బీసీ సర్కార్ అని చెప్పడం ద్వారా ప్రజలకు వైసీపీ మెసేజ్ ఇస్తుంది అన్న మాట. అదే టైమ్ లో తాము ఏం చేస్తున్నామో చెప్పుకోవడం ద్వారా మహనాడు ఇంపాక్ట్ ని చాలా వరకూ డైవర్ట్ చేయడానికి చూస్తోంది అని అంటున్నారు. మొత్తానికి వైసీపీ ప్లాన్ వరకూ ఒకే. కానీ ఈ మంత్రుల బస్సు యాత్ర ఎంతవరకూ మహనాడు ఫోకస్ ని తగ్గించగలదు అన్నదే ప్రశ్న.