రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కారణంగా అధికార పార్టీ మళ్లీ మరోసారి సునాయాసంగా ఒడ్డెక్కే ఛాన్స్ ఉంది. ఇదే ఇప్పుడు చర్చకు తావిస్తోంది. జనాభాలో ఉన్న కాపులంతా జనసేనకు సపోర్ట్ చేయరు. అలా అని జనాభాలో ఉన్న కమ్మలంతా టీడీపీ వైపే ఉండరు. ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. కానీ గత ఎన్నికల్లో తక్కువ మార్జిన్ లో పోయిన సీట్లు అన్నీ టీడీపీ, జనసేన వేర్వేరుగా ఉండడం వల్లే అన్నది తేలిపోయింది.
ఇదే వాస్తవం కూడా ! బొటాబొటీ మెజార్టీతో వైసీపీ కొన్ని సీట్లు గెలవగలిగి తమ బలం ఇవాళ 151 అని పదే పదే చెబుతున్నది అంటే అందుకు కారణం కూడా నాడు టీడీపీ, జనసేన వేర్వేరుగా వెళ్లడమే ! వాస్తవానికి బీజేపీతో పొత్తు వల్ల కూడా పవన్ కు పెద్దగా లాభం ఉందనుకోకూడదు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ లాభం కూడా కాషాయ దళాలకే చెందుతుంది తప్ప పవన్ కొత్తగా ఎదిగేది, సాధించేది ఏమీ ఉండదు. కనుక టీడీపీ ఆ ఒడ్డును వదులుకుంటే నిండా మునిగిపోవడం ఖాయం.ఓ విధంగా ఇది వైసీపీ రెడ్లకు శుభ పరిణామం లాంటిదే ! ఎన్నికలకు ముందే ఫలితం ఏంటన్నది తేలిపోవడం.
పవన్ ను వద్దనుకుంటే మోసపోయేది టీడీపీనే ! పరువుపోయేది టీడీపీకే ! ఈ విషయం గతంలోనూ నిరూపించడం అయినది. కానీ చంద్రబాబు మనుషులు మాత్రం 2019లో చేసిన తప్పే చేస్తున్నారు. పవన్ తో కలవని కారణంగా ఓ లెక్క ప్రకారం టీడీపీ దాదాపు 70 సీట్లు కోల్పోయింది. కొద్దిపాటి ఓట్ల తేడాతోనే ఓడిపోయింది కూడా ! 2014 మాదిరిగా ఉంటే 23 కాదు కానీ 70 సీట్లు అయినా టీడీపీ - జనసేన కూటమికే దక్కేవి.
ఎలా లేదన్నా వైసీపీ అప్పుడు అధికారంలోకి వచ్చినా చెప్పుకోదగ్గ ఓటమితోనే టీడీపీ నెగ్గుకువచ్చేది అసెంబ్లీలో ! ఇప్పటిలా కాకుండా ఉండేది. ఇప్పుడున్న 23లో నలుగురు వైసీపీ వైపు ఉన్నారు అనుకుంటే ఆ లెక్కన చూసుకున్నా టీడీపీ బలం 19గా ఉంది. పోనీ వాసుపల్లి గణేశ్ అనే విశాఖ ఎమ్మెల్యే ఇటుగా అనగా టీడీపీ వైపు వస్తే అప్పుడు చంద్రబాబు పార్టీ బలం 20. అదే పవన్ తో ఉండి ఉంటే, ఎన్నికలకు వెళ్లి ఉంటే ఇలాంటి తప్పిదాలేవీ జరగకపోవును.
ఇప్పుడు తాజాగా కమ్యూనిస్టులకూ పవన్ టార్గెట్ అయ్యాడు. ఆ పార్టీలకు చెందిన నేతలు కూడా పవన్ అపరిపక్వ ధోరణిలో రాజకీయాలు చేస్తున్నారని, తక్కువ శాతం ఓట్లున్న జనసేనకు, ఎక్కువ శాతం ఓట్లున్న టీడీపీకి ఎంతో తేడా అని అంటోంది.
అలాంటిది ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ ను ఎందుకు టీడీపీ ప్రకటిస్తోందని కూడా ప్రశ్నిస్తోంది. ఏదేమయినప్పటికీ పొత్తుల లెక్క తేలకుండా మాట్లాడడం సబబు కాదు అని కూడా అంటోంది ఓ వర్గం. ఇక టీడీపీ కనుక ఆ ఒడ్డను వదిలేస్తే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించిన మాదిరిగా ఆ కాసిన్ని వడ్లూ వద్దనుకుంటే జనసేనను దూరం చేసుకుంటే రెడ్లదే మళ్లీ అధికారం కావడం ఖాయం.