నమ్మిన జిమ్మాస్టిక్స్ ముంచేసింది..

Update: 2019-04-09 10:44 GMT
జిమ్మాస్టిక్స్ నే నమ్ముకున్న ఆ క్రీడాకారిణికి అదే పెద్ద శాపంగా మారింది. నమ్మిన క్రీడనే నట్టేట ముంచుతుందని ఆమె భావించలేదు. ఎంతో బలం, చురుకుదనం, సమతుల్యత, ఓర్పుతో చేసే జిమ్మాస్టిక్స్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. అయితే కొంచెం పట్టుతప్పినా  ఆ క్రీడలో ఎంతటి అనర్థాలు వాటిల్లుతాయో చెప్పే సంఘటన తాజాగా చోటుచేసుకుంది.

జిమ్మాస్టిక్స్ ప్రాణంగా భావించే ఓ క్రీడాకారిణి తన రెండు కాళ్లను విరగగొట్టుకున్న దారుణ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒళ్లు గగొరుపొడిచే ఆ వీడియో చూసి అందరూ కలత చెందుతున్నారు. ఆ రెండు కాళ్లను కోల్పోయిన ఆ క్రీడాకారిణి ఇప్పుడు మొత్తం జిమ్మాస్టిక్స్ కే గుడ్ బై చెప్పడం గమనార్హం.

అమెరికాలోని ఆబర్న్ యూనివర్సిటీకి చెందిన సమంతా సెరియో అనే జిమ్మాస్ట్.. శుక్రవారం జరిగిన బేటన్ రోగ్ రిజనల్ పోటీల్లో పాల్గొంది. పాస్ చేస్తున్న సందర్భంలో ఆమె ఎగిరి ల్యాండ్ అయ్యేటప్పుడు పట్టు తప్పింది. ల్యాండింగ్ లో రెండు కాళ్లూ మోకాళ్ల వద్ద విరిగిపోయాయి. నొప్పితో అల్లాడిపోయిన సమంత అలా ఎందుకు ఏడుస్తూ కొద్దిసేపటి దాకా ఎవ్వరికీ అర్థం కాలేదు. కొద్ది సేపటికి ఆమె రెండు కాళ్లు విరిగిన సంగతి తెలిసి అక్కడి వారు స్ట్రెచర్ పై ఆస్పత్రికి తీసుకెళ్లారు.

ఆమె గుడ్డిగా హ్యాండ్ స్ర్పింగ్ చేయడం వల్లే రెండు కాళ్లు విరిగిపోయాయని జిమ్మాస్టిక్ నిపుణులు చెబుతున్నారు. ఇక తీవ్రగాయాలతో రెండు కాళ్లు విరిగిపోవడంతో తన జిమ్మాస్టిక్స్ కెరీర్ కు గుడ్ బై చెబుతున్నట్టు ఇన్ స్టాగ్రామ్ లో సమంత తెలిపింది.తన 18 ఏళ్ల కెరీర్ ఈ గాయంతో దూరమైందని వివరించింది. ఇప్పుడు సమంత కాళ్లు విరిగిన వీడియో నెట్టింగ్ వైరల్ గా మారింది.

Full View
Tags:    

Similar News