అమెరికాలోని భారతీయ నిపుణులకు ఊహించని షాక్ వంటి వార్త ఇది. అమెరికా హెచ్1బీ వీసాలను పొందడానికి నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు వాటి విషయంలో నూతన ప్రతిపాదనలు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్ది రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో చాలామంది అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వెళ్లాలనుకునే వారికి నిరాశే ఎదురైంది. మరోవైపు హెచ్–1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు (భర్త లేదా భార్య) హెచ్–4 వీసాలను మంజూరు విషయంలోనూ ట్రంప్ కత్తికట్టారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలు సద్దుమణుగుతున్న సమయంలోనే వీసా గడువు పొడగింపు లేదా స్టేటస్ మార్చుకోవడం తిరస్కరణకు గురైతే - హెచ్-1బీ వీసాదారులు దేశ బహిష్కరణ విచారణలను ఎదుర్కొనేలా కొత్త సవరణను ట్రంప్ సర్కారు ప్రతిపాదించారు. దీని ప్రకారం వీసా పొడిగింపు దరఖాస్తు లేదా పిటిషన్ తిరస్కరణకు గురైనప్పుడు లేదా చట్టవిరుద్ధంగా ఆ దరఖాస్తుదారుడు అమెరికాలో ఉన్నప్పుడు నోటీస్ టూ అప్పియర్(ఎన్ టీఏ)’ నోటీసులు అందుకుంటాడు. ఈ నోటీసులే దేశ బహిష్కరణకు తొలి అడుగుగా మారుతున్న నేపథ్యంలో అమెరికాలోని మనోళ్లలో కలవరం మొదలైంది.
ప్రపంచంలోనే అత్యంత వృత్తి నిపుణులుగా ఖ్యాతిపొందుతున్న భారతీయులు ప్రధానంగా హెచ్-1బీ వర్క్ వీసాలతో అమెరికాకు వస్తున్నారు. 2016లో అమెరికా ప్రభుత్వం జారీచేసిన మొత్తం హెచ్-1బీ వీసాల్లో 74.2 శాతం వీసాలు భారతీయ ఐటీ నిపుణులే దక్కించుకున్నారు. 2017లో ఈ సంఖ్య మరింత పెరిగి 75.6 శాతానికి చేరుకుంది. అమెరికా పౌరసత్వ - వలససేవల సంస్థ (యూఎస్ సీఐఎస్) ఈ మేరకు ఇటీవల గణాంకాలు వెల్లడించింది. ఇంత భారీ స్థాయిలో ఉన్న వారి వెన్నులో వణుకుపుట్టేలా అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్ జూన్ 28న విడుదల చేసిన పాలసీ మెమొరాండం మారింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం హెచ్1బీ వీసా గడువు ముగిసిన తర్వాత పునరుద్దరణ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. సా ముగుస్తున్న సమయంలో ఉద్యోగి తరఫున కంపెనీ దరఖాస్తు చేసేది. గడువును అమెరికా అధికారులు తిరస్కరిస్తే వెంటనే సదరు ఉద్యోగి తిరిగి స్వదేశానికి వచ్చేస్తారు. కంపెనీ మళ్ళీ దరఖాస్తు చేసి వీసా వస్తే తిరిగి అమెరికా వెళ్ళేవారు. కాని ఇప్పుడు ఈ నిబంధనలను మరింత కఠినం చేస్తున్నారు. వీసా పొడిగింపు తిరస్కరణకు గురైనప్పుడు లేదా వీసా రాకున్నా 240 రోజులు గడువు దాటాక కూడా అమెరికాలో ఉంటే ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి వచ్చే ఈ నోటీసు ప్రకారం కోర్టులో హాజరై సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీసా రాకుంటే 240 రోజుల గడువు దాటాక దరఖాస్తు విషయం తేలేవరకు సదరు ఉద్యోగి అమెరికాలో ఉండాల్సి వస్తే, అది అక్రమంగా అమెరికాలో ఉన్న కిందకే వస్తుంది. దీంతో సదరు ఉద్యోగి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుంది.
ఎన్ టీఏ అందుకున్న వారిని తదుపరి దశలో దేశ బహిష్కరణ చేయడం సులభంగా మారుతున్న క్రమంలో తాజా ప్రతిపాదనలు మన ఎన్నారైలకు మింగుడుపడని రీతిలో మారాయి. ఎందుకంటే...నోటీస్ వచ్చిందంటే హెచ్-1బీ వీసాదారులు సమస్యల ఊబిలో చిక్కుకున్నట్టే. ఒకవేళ నోటీసుకు సమాధానం ఇవ్వకండా భారత్‌కు వచ్చేస్తే మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టకుండా అయిదేళ్ళు నిషేధం విధిస్తారు. నోటీసు వచ్చేలోగానే తమకు తాము దేశం విడిచి పెట్టి వెళ్ళేందుకు కోర్టు అనుమతి కోరవచ్చు. వీసా తిరస్కరించిన తరవాత అక్కడే ఉంటే.. ఆ వ్యవధి ఏడాది దాటితే.. వారిపై పదేళ్ళ వరకు మళ్ళీ అమెరికాలో ప్రవేశించకుండా నిషేధం విధించే అవకాశముందని తెలిసింది. ఈ నిబందన విద్యార్థులకు సైతం వర్తిస్తున్న నేపథ్యంలో ఇటు విద్యార్థులు, అటు ఉద్యోగులు విస్మయానికి గురవుతున్నారు.