కీల‌క నేత‌ల గుప్పిట్లో ఉత్త‌రాంధ్ర‌.. ఇలా అయితే క‌ష్ట‌మే

Update: 2021-07-02 13:30 GMT
ఔను! గ‌తంలో టీడీపీ ఏ విధంగా అయితే.. చేసిందో.. ఇప్పుడు వైసీపీ కూడా అదే పంథాలో ప‌య‌నిస్తోంద‌ని అంటున్నారు ఉత్తరాంధ్ర రాజ‌కీయ విశ్లేష‌కులు. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల నాడి ఎప్పుడూ ఒకే రకంగా ఉండ‌దు. ప‌రిస్థితిని బ‌ట్టి.. అవ‌కాశాన్ని బ‌ట్టి మారిపోతుంది. గ‌తంలో హుద్ హుద్ తుఫాను వ‌చ్చినా.. త‌ర్వాత‌.. మ‌రో తుఫాను వ‌చ్చినా.. చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు.. చాలానే ఆదుకున్నారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ అయితే.. ఏకంగా నెల‌ల త‌ర‌బ‌డి ఇక్క‌డ రోడ్ షోలు నిర్వ‌హించి స‌మ‌స్య‌ల‌పై ఎలుగెత్తారు. అయినా. ప్ర‌జ‌లు వారిని క‌రుణించ‌లేదు.

అంటే.. వారిపై వ్య‌తిరేక‌త ఉంద‌ని కాదు.. క్షేత్ర‌స్థాయిలో ఉన్న రాజ‌కీయాల‌ను అంచ‌నా వేసుకుని.. ప్ర‌జ‌లు త‌మ మైండ్ సెట్‌ను మార్చుకుంటూ ఉంటారు. దీనిని అంచ‌నా వేయ‌డంలోనే గ‌తంలో టీడీపీ ఘోరంగా విఫ‌ల‌మైంది. దీనికి కార‌ణం కొంద‌రు నేతలే ఉత్త‌రాంధ్ర జిల్లాల‌ను త‌మ గుప్పిట్లోపెట్టుకుని.. ప్ర‌జ‌ల వాద‌న‌ను, వారి అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా అడుగులు వేయ‌డ‌మే. దీంతో టీడీపీ ఎంత చేసినా.. ఇక్క‌డ ప్ర‌జ‌లు ఆ పార్టీని ఆద‌రించ‌లేదు. ఇప్పుడు డిటో.. వైసీపీ నేత‌లు కూడా అలానే చేస్తున్నారు. విశాఖ‌, శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం..ఈ మూడు జిల్లాల్లోనూ ఆధిప‌త్యం చ‌లాయిస్తున్న నేత‌లు కొంద‌రు.. వారి గుప్పిట్లో పెట్టుకున్నారు.

దీంతో క్షేత్ర‌స్థాయిలో ఎమ్మెల్యేలు... ఎంపీలు కూడా మౌనంగా ఉండిపోతున్నారు. పోనీ.. ఇలా ఆధిప‌త్యం చ‌లాయిస్తున్న నేత‌లు.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితుల‌ను అర్ధం చేసుకుని ముందుకు సాగుతున్నారా ? అంటే.. అదేమీలేదు. రెండు ప్రెస్‌మీట్లు.. నాలుగు ట్వీట్లు .. అన్న‌చందంగా ముగించేస్తున్నారు. దీంతో ఉత్త‌రాంధ్ర క‌ష్టాల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి ప‌రిష్క‌రించే నేత‌లు క‌నిపించ‌డం లేదు. ఇదే గ‌తంలోనూ జ‌రిగింది.

విశాఖ‌లో సాయిరెడ్డి దూకుడు, శ్రీకాకుళంలో స్పీక‌ర్ స‌హా మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు వ్య‌వ‌హారం, విజ‌య‌న‌గ‌రంలో బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆధిప‌త్య రాజ‌కీయంతో ఈ మూడు జిల్లాల్లోనూ వైసీపీ పుంజుకోవ‌డం మాట అటుంచితే.. మున్ముందు.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు. అనుభ‌వం ఉన్న నాయ‌కులు కూడా ఇలానే చేస్తుండ‌డం మ‌రింతగా వైసీపీ సానుభూతిప‌రులను బాధిస్తుండ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News