తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత - ఏఐసీసీ సభ్యుడు వీ హనుమంతరావు(వీహెచ్) రాజకీయాలు వదిలేశారా? సంఘ సేవలో తరిస్తున్నారా? ముఖ్యంగా మహిళల సేవలో తరించాలని నిర్ణయించుకున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ ఘటన దీనినే నిరూపిస్తోంది. టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ `అర్జున్ రెడ్డి` కి సంబంధించిన ప్రచారం ఊపందుకుంది. ఈ మూవీలో హీరో హీరోయిన్లు లిప్ లాక్ చేసుకునే సీన్ ను ఈ మూవీ మేకర్స్ భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే క్రమంలో ఈ పోస్టర్లను హోరెత్తిస్తున్నారు.
ఆర్టీసీ బస్సులు - పత్రికలు - వీడియో ప్రచారాల్లో ఈ ఘాటు ముద్దు సీన్ అదిరిపోతోంది. దీనిని గమనించిన వీహెచ్.. ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. థూ.. నీయవ్వ! ఈ సీన్లేంది! అనుకున్నారో ఏమో.. వెళ్తూ వెళ్తూ.. ఆ పోస్టర్లు ఉన్న ఆర్టీసీ బస్సులను ఆపి మరీ వాటికి ఏర్పాటు చేసిన ఈ సీన్ పోస్టర్లను తన అనుచరులతో కలిసి చింపేశారు. దీనికి ముందు గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ మూవీ మేకర్స్ పై వీహెచ్ విరుచుకుపడ్డారు. అంతేకాదు, ఇలాంటి ఘాటైన పోస్టర్లను బస్సులపై అతికించేందుకు అధికారులు ఎలా అనుమతించారని ఒకింత ఘాటుగానే ప్రశ్నించారు.
డబ్బు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ముద్దు సీన్లను - మహిళలను కించపరిచేలా ఉన్న సీన్లను ప్రోత్సహిస్తుందా? అని ప్రశ్నించారు. ఇదేనా బంగారు తెలంగాణ అని దుయ్యబట్టారు. మీడియాతో మాట్లాడుతూనే ఆయన మీడియాను వెంట పెట్టుకుని సమీపంలోని బస్సుల వద్దకు చేరుకుని అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్లను చింపేశారు. దీంతో భారీ ఎత్తున జనాలు గుమిగూడారు. ఇక, ఈ మూవీ ఈ నెల 25 న విడుదల కానుంది. మొత్తానికి వీహెచ్ ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించింది.