తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళలో పెద్దగా యాక్టివ్ గా లేని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు.. ఈ మధ్యన మస్తు హుషారయ్యారు. తోపుల్లాంటి కాంగ్రెస్ నేతలంతా నోరు తెరవటానికి ఇబ్బంది పడుతున్న వేళ.. అందుకు భిన్నంగా వీహెచ్ మాత్రం ఓ రేంజ్లో విరుచుకపడుతున్నారు. ఏ మాత్రం అవకాశం లభించినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శనాస్త్రాల్ని సంధిస్తున్నారు.
ఆదివారం సోషల్ మీడియాలో అస్క్ కేటీఆర్ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించిన కేటీఆర్.. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చే క్రమంలో గ్లోబరీనా సంస్థ గురించి తనకు అస్సలు తెలీదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ నోటి నుంచి వచ్చిన ఈ మాటను ప్రతి మీడియా సంస్థ తన వార్తలో దీన్నే హైలెట్ చేయటం తెలిసిందే. తాజాగా వీహెచ్ కూడా ఇదే పాయింట్ పట్టుకొని చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తప్పులకు కారణంగా గ్లోబరీనాగా అంతా వేలెత్తి చూపిస్తున్న వేళ.. ఆ సంస్థ గురించి తనకు అస్సలు తెలీదన్న కేటీఆర్ ను ఉద్దేశించి వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడి వద్దకు వచ్చిన వీహెచ్.. మధ్యాహ్నం 12 గంటల లోపు గ్లోబరీనా సంస్థ తనకు తెలీదని గుడిలో అమ్మవారిఎదుట కేటీఆర్ ప్రమాణం చేయాలన్నారు.
వీహెచ్ అలా పిలిస్తే.. ఇలా పరుగులు పెడుతూ వచ్చి.. ప్రమాణం చేయటానికి.. తన విశ్వసనీతయతను చాటుకోవటానికి కేటీఆర్ లాంటి నేత వస్తారా ఏంది? మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకూ గుడిలో వెయిట్ చేసిన వీహెచ్.. తాను విసిరిన సవాల్ కు స్పందించకపోవటం ద్వారా గ్లోబరీనాతో కేటీఆర్ కు సంబంధం ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లుగా తేల్చేశారు వీహెచ్.
అనంతరం అమ్మవారి వద్ద కేటీఆర్ ను తెగ శాపనార్థాలు పెట్టేసిన వీహెచ్.. ఇంత మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల కారణంగా కేసీఆర్ ప్రభుత్వం రెండేళ్లలోపే కూలిపోతుందన్నారు. విద్యార్థుల్ని అన్యాయం చేసిన వారెవరూ బాగుపడరని మండిపడ్డారు. ఐదేళ్లు ఐటీ మంత్రిగా చేసిన కేటీఆర్ కు.. గ్లోబరీనా సంస్థ తెలీకపోవటం ఏమిటంటూ ప్రశ్నించారు. మొత్తానికి.. గ్లోబరీనా పేరుతో వీహెచ్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదని చెప్పక తప్పదు.