కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టింది నేనే

Update: 2019-05-02 05:30 GMT
గ్లోబరీనా సంస్థ తనకు తెలియదు అని కేటీఆర్ అనడం.. ఇదే మాట జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడిలో ప్రమాణం చేసి చెప్పాలని వీహెచ్ గుడికి వెళ్లి నానా హంగామా చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. దీనిపై కేటీఆర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. వీహెచ్ ను బఫూన్ అంటూ నోరు జారారు. బఫూన్ పిలిస్తే నేను గుడికి వెళ్లి ప్రమాణం చేయాలా అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు.  దీంతో ఈ పదజాలం వాడడంపై వీహెచ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

వీహెచ్ మాట్లాడుతూ ‘నీ అయ్యకు రాజకీయ భిక్ష పెట్టినవాడిని నేనే.. నన్నే బఫూన్ అంటావా..?’ అంటూ కేటీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోరు అదుపులో పెట్టుకో కేటీఆర్.. మాట్లాడే భాష మార్చుకోవాలని.. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోం జాగ్రత్త అంటూ వీహెచ్ హెచ్చరించారు. సమయం వచ్చినప్పుడు ఎవరు బఫూనో చెబుతానన్నారు.

గ్లోబరీనా సంస్థతో తన బావమరిదికి సంబంధం లేకుంటే కేటీఆర్ పెద్దమ్మ గుడికి ఎందుకు రాలేదో చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు. అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.

ఇక హాజీపూర్ లో రేపిస్ట్ ఘాతుకాలపై కూడా వీహెచ్ మాట్లాడారు. ముగ్గురు బాలికలను హత్యచేసిన మర్రి శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు. టీఆర్ ఎస్ పాలనలో ఎవరికీ రక్షణ లేదని ఫైర్ అయ్యారు.
Tags:    

Similar News