రూపాయి.. విలువ పడిపోయి.. ఏడాది ఆఖరికి డాలర్ తో రూ.80-81?

Update: 2022-06-30 08:30 GMT
దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ఎన్ని మాటలు చెప్పినా.. పరిస్థితి చూస్తుంటే ఆందోళన వ్యక్తమవుతోంది. డాలర్ తో రూపాయి మారకం విలువ రోజురోజుకు పడిపోతోంది. డాలర్లు
ఖర్చయిపోతున్నాయి.. ఖజానా ఖాళీ అవుతుందా...? అన్న ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపా యి చిక్కి శల్యమైపోతోంది. మంగళవారం అమెరికన్‌ డాలర్‌ విలువతో రూపాయి 48 పైసలు నష్టపోయి చారిత్రక కనిష్ఠ స్థాయి 78.85 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరల పెరుగుదలతో పాటు దేశీయ ఈక్విటీ మార్కెట్‌ బలహీనత, నిరంతరాయంగా తరలిపోతున్న విదేశీ నిధులు ఇందుకు కారణం. మంగళవారం రూపీ 78.53 వద్ద ప్రారంభమై ఒక దశలో కనిష్ఠ స్థాయి 78.85850 తాకింది. చివరికి 48 పైసల నష్టంతో 78.85 వద్ద ముగిసింది. బుధవారం మరింత క్షీణించి సరికొత్త జీవనకాల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఫారెక్స్‌ మార్కెట్లో అమెరికన్‌ డాలర్‌తో మన రూపాయి మారకం విలువ బుధవారం మరో 18 పైసలు తగ్గింది. దాంతో డాలర్‌-రూపాయి మారకం రేటు రూ.79.03కి చేరుకుంది. ఇది రూ.79 స్థాయిని దాటడం చరిత్రలో ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా డాలర్‌ మరింత బలం పుంజుకోవడం, ముడిచమురు ధరలు మళ్లీ ఎగబాకడంతోపాటు దేశీ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం ఈ పతనానికి కారణం. మంగళవారం సైతం రూపాయి 48 పైసలు బలహీనపడి రూ.78.85 వద్దకు చేరింది. కేవలం ఈ నెలలోనే రూపాయి విలువ 1.97 శాతం క్షీణించింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 6.39 శాతం పతనమైంది.మన దగ్గరున్న నిల్వలు ఇలా..

59,640 కోట్ల డాలర్లు  ప్రస్తుతం మన దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్యం. రూపాయిల్లో చెప్పాలంటే.. 46.48 లక్షల కోట్లు. మార్చి, ఏప్రిల్ నెలలో ఐదు వారాల పాటు తగ్గతూ వచ్చిన మారకద్రవ్యం.. ఇప్పుడు జూన్లో మళ్లీ మూడు వారాలు తగ్గింది. ఫోరెక్స్ నిల్వలు తగ్గుతున్న కారణంగా ఇతర అంశాల్లోనూ వెనుకబడిపోయే పరిస్థితి కనిపిస్తోది. రూపాయి విలువ కూడా పడిపోతోంది. ప్రస్తుతం మనం ఒక డాలర్ కు 78 రూపాయలుపైగా సమర్పంచుకుంటేనే మనకు ఎక్స్ఛేంజ్ సాధ్యమవుతోంది. బంగారం కూడా తగ్గిపోతోంది. మనకు దిగుమతులుచేసే దేశాలు కోరితే అనివార్యంగా బంగారం రూపంలో  ల్లించాల్సి ఉంటుంది.

మరో వైపు భారత్ లో పెట్టుబడులు పెట్టేవారు తగ్గిపోతున్నారు. పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు పెట్టిన డబ్బులు తీసుకుంటున్నారు.ముడి చమురు దిగుమతి ధర ఇప్పుడు 120 డాలర్లకు చేరుకుంది. మన దిగుమతి వ్యయంలో 32 శాతం చమురుకే వ్యయం చేయాల్సిన తరుణంలో విదేశీ మారక ద్రవ్యం మొత్తం ఖాళీ అవుతోందని ఆర్థిక వెత్తలు గగ్గోలు పెడుతున్నారు.ప్రభావం ఎవరిపై???

విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుతూ ఉంటే ప్రధానంగా పారిశ్రామిక రంగంపై ప్రభావం పడుతుంది. చమురు, బొగ్గు దిగుమతులు, మెటల్స్, ఖనిజాలు, పారిశ్రామిక మాధ్యమిక ఉత్పత్తుల వ్యయాలు పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, బంగారం ధరలు కాస్త తగ్గే పరిస్థితి ఏర్పడినా రూపాయి విలువ క్షీణత కారణంగా వాటి ప్రత్యక్ష ప్రయోజనం సగటు వినియోగదారుడికి చేరే అవకాశం ఉండటం లేదు. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడం మామూలు విషయం కాదు… అసలే భారత ఆర్థిక వ్యవస్థ క్లిష్టంగా ఉంది. అందుకే అందరూ మోదీ మ్యాజిక్ కోసం ఎదురు చూస్తున్నారు.

అమెరికా సెంట్రల్‌ బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను వేగంగా పెంచుతుండటంతో పాటు కరోనా సంక్షోభ సమయంలో కల్పించిన ద్రవ్య ఉద్దీపనలను ఉపసంహరించుకుంటోంది. దాంతో డాలర్‌ నిధుల లభ్యత తగ్గనుందన్న భయాలు ఆ దేశ కరెన్సీకి డిమాండ్‌ను పెంచుతున్నాయి. మున్ముందు రూపాయి విలువ మరింత క్షీణించవచ్చన్నారు. యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) వార్షిక సదస్సుతో పాటు పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య(ఒపెక్‌) సమావేశం నిర్ణయాలు సమీప భవిష్యత్‌లో రూపాయి మారకం రేటుకు మార్గనిర్దేశం చేయవచ్చు. ఎక్స్ఛేంజ్‌ రేటు ఇప్పటికే రూ.78.50 కీలక స్థాయిని దాటేయడంతో త్వరలోనే రూ.79.20 వరకు చేరుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది చివరినాటికి మారకం రేటు రూ.80-81 స్థాయిని చవిచూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ప్రవాసులకు పండుగే..?

డాలర్ తో రూపాయి విలువ పడిపోతుండం ప్రవాస భారతీయులకు మేలు చేకూర్చేదే? ఎందుకంటే.. అక్కడే వంద డాలర్ల సంపాదించారని అనుకుంకుండా..? ఇక్కడ మన రూపాయి ప్రస్తుతం విలువ 78గా భావిస్తే.. 78 రూపాయిలు వస్తాయి. అదే.. డాలర్ తో రూపాయి విలువ రూ.80కి పెరిగితే.. రూ.80 వస్తాయి. ఈ మొత్తం ఎంత పెరిగితే.. విలువ అంత పెరుగుతూ పోతుంది. లక్ష డాలర్లు ప్రస్తుతం 78 లక్షలు అయితే.. మారకం విలువ రూ.80కి చేరితే.. రూ.80 లక్షలు అవుతుంది. అంటే.. రూ.2 లక్షలు పెరుగుదల.
Tags:    

Similar News