ఓఎల్ఎక్స్ మన దగ్గర ఉన్నపాత వస్తువులు అమ్మేందుకు ఇదో మంచి వేదిక. చాలా మంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు. మధ్యవర్తులు ఉండరు కాబట్టి కొనేవాళ్లకు కూడా తక్కువ ధరకే వస్తువులు దొరుకుతాయి. అమ్ముకొనేవాళ్లకు మంచి ధర వస్తుంది. అయితే ఈ సైట్ ఇప్పుడు తీవ్రంగా దుర్వినియోగం అవుతోంది. సైబర్ నేరగాళ్లు ఈ సైట్‌ను అడ్డం పెట్టుకొని ఎన్నో అక్రమాలు పడుతున్నారు. ఫేక్ ఫొటోలు పెట్టి అమ్మకానికి వస్తువులు ఉన్నాయంటూ మోసాలు చేస్తున్నారు. అయితే ఇప్పడు ఏకంగా మోదీ కార్యాలయానికే టోకరా వేశారు.
నరేంద్రమోదీ వారణాసి పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. వారణాసిలో ఆయనకు ఓ అధికారిక నివాసం ఉంది. ఈ ఇంటిపై ఇప్పుడు ఆన్ లైన్ దొంగలు కన్నేశారు. ఓఎల్ఎక్స్లో ఏకంగా ప్రధాని మోదీ కార్యాలయాన్నే అమ్మకానికి పెట్టారు కొందరు ప్రబుద్ధులు. నరేంద్ర మోదీ వారణాసి కార్యాలయాన్ని రూ .7.5 కోట్ల ధరకు అగంతకులు అమ్మకానికి పెట్టారు. దీంతో ఎవరో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబర్‌క్రైం శాఖ రంగంలోకి దిగి ఆ పోస్టును తొలగించింది.
మోదీ కార్యాలయాన్ని వాళ్లు విల్లాగా పేర్కొన్నారు.. 4 గదులు , 4 బాత్రూమ్లతో 6,500 చదరపు అడుగుల ఈ భవంతి ఉందని వివరాలు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ పెట్టిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓఎల్ఎక్స్లో గతంలోనూ వారు ఇటువంటివి పోస్టు చేశారు. అయితే పోస్టులు చేసేటప్పుడు ఓఎల్ఎక్స్లో కూడా క్రాస్‌చెక్ చేసుకొనే విధానం బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.