మొన్నటి వరకూ యమా స్పీడ్ గా ఉండే నెట్ ఉన్నట్లుండి స్లో అయ్యింది కదూ. మొన్నా మధ్య వరకూ నెట్ ఉన్నా.. లేకున్నా బతుకు బండి నడిపేయొచ్చు. కానీ.. ఇప్పుడా అవకాశమే లేదు. నోట్ రద్దు పుణ్యమా అని నెట్ అన్నది ప్రాణావసరంగా మారిపోయింది. మోడీ మొదలు మన చంద్రుళ్ల వరకూ నగదురహిత లావాదేవీలంటూ నెట్ తోనే బతకు బండి లాగాలంటూ ప్రోత్సహిస్తున్న వేళ.. అదెంత ఇబ్బందికరమైనదన్న విషయాన్ని వర్ధ చెప్పకనే చెప్పేసింది.
నెట్ స్లో కావటం ఏంటి? మోడీ.. చంద్రుళ్లు ఏంది? నగదు రహితం ఏమిటి? వర్ధ ఏమిటి...? అంటూ డౌట్ల మీద డౌట్లు వస్తున్నాయా? ఈ కథనం మొత్తం చదివితే విషయం ఇట్టే అర్థమవుతుంది. ముందుగా.. గత మూడు.. నాలుగు రోజుల నుంచి నెట్ ఎందుకు స్లో అయ్యిందన్నది చూద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర తుఫానుగా మారి.. దానికి వార్ధా అన్న పేరు పెట్టేయటం.. అది తన విశ్వరూపం చూపించటం.. తమిళనాడు మొత్తం అతలాకుతలం కావటం తెలిసిందే.
ఈ తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం అల్లకల్లోలం మారితే.. మన బతుకులు ఎంత దారుణంగా మారతాయన్నది తమిళనాడు తుఫాను విధ్వంస దృశ్యాలు టీవీల్లో చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అయితే.. ఈ కల్లోలం తమిళనాడుకు మాత్రమే కాదు.. మిగిలిన ప్రాంతాల వారి మీద కూడా పడింది. ఎందుకంటే.. సౌదీ అరేబియా నుంచి.. సింగపూర్ నుంచి ఇంటర్నెట్ కేబుల్ లైన్ కు సంబంధించిన కీలకమైన గేట్ వే మన దేశంలో ముంబయి.. చెన్నైలలోనే ఉంది. ముంబయితో పోలిస్తే.. చెన్నైలోని సముద్రంలోని గేట్ వే కీలకమైంది. ప్రభుత్వ.. ప్రైవేటు రంగాల టెలికం కంపెనీలకు సంబంధించిన ఈ కేబుల్ లైన్.. వార్ధా తుఫాను కారణంగా.. సముద్ర అంతర్భాగంలోని కేబుళ్లు దెబ్బ తిన్నాయి.
దీంతో.. నెట్ సేవలు నెమ్మదించాయి. కేబుళ్లు పూర్తిస్థాయిలో కాకున్నా.. కొంతమేర దెబ్బ తినటంతో ఇంటర్నెట్ సేవల మీద ఆ ప్రభావం పడింది. దీంతో.. మొన్నటి వరకూ జెట్ స్పీడ్ తో దూసుకెళ్లే నెట్ స్పీడ్ కాస్తా.. ఇప్పుడు నెమ్మదించింది. అలా వార్ధా తమిళనాడునే కాదు.. దేశంలోని మిగిలిన రాష్ట్రాల మీదా తన ప్రభావాన్ని చూపింది. చెన్నై గేట్ వే అనుసంధానంతో ఉండే నెట్ వర్కులన్నీ తాజా తుఫానుతో నెమ్మదించాయి.
ఇదొక ఇష్యూ అయితే.. వార్ధా తుఫాను చేసే వార్నింగ్ ఏమిటంటే.. నగదు రహిత లావాదేవీల మీద ఎక్కువ దృష్టి పెడుతున్న మోడీ సర్కారు.. వార్ధా లాంటి ప్రకృతి విపత్తులు విరుచుకుపడితే ఏం చేస్తారన్నది? ఒకమోస్తరు తుఫానుకే ఇంతగా ఇబ్బంది పడితే.. రేపొద్దున భారీ సునామీ విరుచుకుపడితే.. గేట్ వే వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయ్యిందనుకుందాం? అప్పుడు పరిస్థితి ఏంది? గతంలో ఇంటర్నెట్ లేకున్నా బతకు బండి నడిచి పోయేది. కానీ.. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు.. ప్రభుత్వ విధానాల పుణ్యమా అని నెట్ లేకుంటే నిమిషం కూడా గడవని పరిస్థితి. అంతగా ఆధారపడిపోతున్న వేళ..ప్రకృతి కన్నెర్ర చేస్తే.. పరిస్థితి ఏంది? అన్నది పెద్ద ప్రశ్న. కొత్త విధానాల్ని తెర మీదకు తెచ్చే వేళ.. పాలకులు ఇలాంటి సమస్యలకు ఎలాంటి సొల్యూషన్స్ ఆలోచించారన్న విషయాన్ని ప్రజలకు చెబితే మంచిది. లేకుంటే.. మరిన్ని తిప్పలు ఖాయం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/