వీరమాచనేని రామకృష్ణ డైట్ పై చాలాకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరమాచినేనికి గుంటూరు జిల్లాలోని విజ్ఞాన్ డీమ్డ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. డైట్‌కు సంబంధించి వీచమాచినేని కృషికిగాను డాక్టరేట్ ప్రదానం చేసినట్లు వర్సిటీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై దుమారం రేగుతోంది. సైన్స్ ను తప్పుబట్టే వీరమాచినేనికి డాక్టరేట్‌లు ఇవ్వడం ఏమిటని, డాక్టరేట్ ఇచ్చే ముందు రూల్స్ చెక్ చేశారా? డీమ్డ్ వర్సిటీలకు ఉన్న డైరెక్షన్స్ ఏంటి?.. అంటూ హేతువాదులు విమర్శిస్తున్నారు.
వీరమాచినేనికి డాక్టరేట్ ఇచ్చిన విజ్ఞాన్ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని హేతువాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరమాచినేనికి, ప్రముఖ హేతువాది బాబు గోగినేనికి మధ్య వివాదం జరుగుతోంది. కంట్రోల్ కాని డయాబెటిస్‌కు వైద్యం ఎందుకని, అల్లోపతితో నయం చేయలేనిది వీఆర్కే డైట్ వల్ల సాధ్యం అయిందని వీరమాచినేని చెబుతున్నారు. అయితే, అసలు డయాబెటీస్ లేదన్న వ్యక్తికి డాక్టరేట్ ఏంటని బాబు గోగినేని ప్రశ్నిస్తున్నారు.
కరోనాకు వంటింటి చిట్కాలు పరిష్కారం అన్న వీరమాచినేని...వ్యాక్సిన్ ఎందుకు వేసుకున్నారంటూ బాబు గోగినేని విమర్శించారు. ఇక, ఇంగ్లిషు మందులను మురికి గుంటలో పడేయాలని, కరోనా వ్యాక్సిన్ తో ఎలాంటి ఉపయోగం లేదని వీరమాచినేని చేసిన వ్యాఖ్యలపై ఐఎంఏ మండిపడుతోంది. వీరమాచినేనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వివాదంపై వీరమాచినేని తాజాగా ఓ చానెల్ లైవ్ షోలో వివరణనిచ్చారు.
తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని, తాను ఇంగ్లిషు మందులు పనికిరానివని అనలేదని చెప్పారు. తన డైట్ కు కొంతమంది డాక్టర్ల మద్దతు కూడా ఉందని అన్నారు. తన వైద్యంపై ఏ మాత్రం నమ్మకం లేని వారిని డిబేట్ లోకి తీసుకువచ్చి తనపై విమర్శలు గుప్పించారని ఆరోపించారు. లక్షమంది వీరమాచినేనిలు కలిసినా వైద్యంలో ఒక్క అల్లోపతి డాక్టరుకు సమానం కాడని తాను గతంలోను చెప్పానని, ఇపుడు కూడా చెబుతున్నానని అన్నారు. తాను డైట్ గురించి మాత్రమే చెబుతున్నానని అన్నారు.
మందులు వాడకుండా డైట్ తో డయాబెటిక్ తగ్గించవచ్చని చెప్పానని, అంతేగానీ, తాను చెప్పిన డైట్ కచ్చితంగా పాటించకపోయినా డయాబెటిక్ రాదని చెప్పలేదని అన్నారు. అమెరికా వంటి అగ్ర రాజ్యాలు డయాబెటిక్ మందులను ఓ మాఫియాలా చేశాయని, దానిని భారతీయ వైద్యులు ఫాలో అవుతున్నారని, వారు నిమిత్త మాత్రులని అన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణనిచ్చారు.