వెరీ గుడ్ సీదిరి : ప్రాణాలు కాపాడిన ఏపీ మంత్రి !

Update: 2022-04-25 06:30 GMT
అతి పేద కుటుంబం  పెద్ద‌గా చ‌దువులు లేని కుటుంబం. ఇంకా చెప్పాలంటే మ‌త్స్య‌కార కుటుంబంలో అంత‌టి చ‌దువు ఎవ్వ‌రికీ లేదు ఆ ఊళ్లో ! ఆయ‌న మాత్రం చ‌దువు అంతా ప్ర‌భుత్వ బడుల్లో సాగించారు. ఆ ప్రేమ ఆ మ‌క్కువ‌తోనే ఇవాళ్టికీ చ‌దువుకే తొలి ప్రాధాన్యం ఇస్తారు. త‌న‌కు  ఇంత‌టి స్థాయి ఇచ్చిన వైద్య వృత్తిని అస్స‌లు వ‌దులుకోరు.

వీలున్నంత సంబంధిత రంగానికి ఏదో ఒక‌టి చేయాల‌నే అనుకుంటారు. ఈ త‌రుణాన ప్రాణాపాయంలో ఉన్న ముగ్గురిని ఇవాళ కాపాడి త‌న వృత్తి గౌర‌వం పెంచారు. ఎంద‌రినో మ‌రోసారి  స్ఫూర్తి అయ్యారు. ఆయ‌నే ప‌లాస నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే, మ‌త్స్య‌శాఖ మంత్రి సీదిరి అప్ప‌ల్రాజు.

రాజ‌కీయంగా ఎలా ఉన్నా సామాజిక బాధ్య‌త నిర్వ‌ర్తిచండంలో మాత్రం కొంద‌రు ముందుంటారు. రాజ‌కీయంగా ఎలా ఉన్నా కూడా కొన్ని విష‌యాల్లో మాత్రం ఇత‌రుల క‌న్నా భిన్నంగా స్పందించి మాన‌వ‌త్వం చాటుకుంటారు. డ్యూటీ ఈజ్ గాడ్ అనే న‌మ్మేవారు కొంద‌రు ఇప్ప‌టికీ మ‌న మ‌ధ్యే ఉన్నారు. ఆ విధంగా దైవ స‌మానుడ‌యిన వైద్యుడు అన్ని వేళ‌లా త‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించగ‌ల‌గాలి.

అప్పుడు మాత్రమే ఆయ‌న‌కూ ఆయ‌న చ‌దువు అందించిన బాధ్య‌త‌కూ ఉన్న విలువ పెరుగుతుంది. లేదంటే నాలుగు గోడ‌ల మ‌ధ్య ప్ర‌తినిత్యం ఎన్నో మృత్యు గీతాల‌ను వినాల్సిందే ! అటువంట‌ప్పుడు మారుమూల ప్రాంతాల‌లో అయితే వీటి గురించి వేరే చెప్ప‌క్క‌ర్లేదు. ఈ నేప‌థ్యంలో ఓ డాక్ట‌రు స్పందించారు. ఓ మంత్రి స్పందించారు. ఆ డాక్ట‌రు ఆ మంత్రి ఒక్క‌రే ఆయ‌నే సీదిరి అప్ప‌ల్రాజు. ఇవాళ ప‌లాస ఆస్ప‌త్రిలో త‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించి మాన‌వ‌త్వం చాటారు ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో..

బొడ్డ‌పాడు ప్రాంతానికి చెందిన వివాహిత ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్నారు త‌న ఇద్ద‌రి బిడ్డ‌ల‌కూ ఇంత విషం ఇచ్చి తానూ మింగేశారు. విష‌యం తెలుసుకున్న వెంట‌నే మంత్రి స్పందించారు. స్థానికులసాయంతో స‌మీప ప్ర‌భుత్వాస్ప‌తికి చేర్చారు. ప‌లాస వైద్యాల‌యానికి చేరుకున్నాక బాధితుల విష‌య‌మై ఫోన్ లోనే ఆరా తీశారు. కొంత డైరెక్ష‌న్ డ్యూటీ డాక్ట‌ర్ కు ఇచ్చారు. త‌రువాత ఆస్ప‌త్రికి చేరుకుని వారికి వైద్యం అందించి ముగ్గురి ప్రాణాలూ నిలిపారు.

వీరిలో వివాహిత ప‌రిస్థితి అప్ప‌టికే ఆందోళ‌న‌కరంగా ఉన్నా మంత్రి స‌కాలంలో స్పందించి వైద్యం అందించ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింది. మంత్రి సీదిరి స్పందించిన తీరు కార‌ణంగానే నిండు ప్రాణం నిల‌దొక్కుకుంది. ఇప్పుడీ వార్త నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఎప్పుడూ కోపం మ‌రియు ఆవేశంతో ఊగిపోయే మంత్రి త‌న‌దైన శైలిలో స్పందించి మాన‌వ‌త‌ను చాటుకోవ‌డం ఈ ఆదివారం లో విశేషం.  ఈ ఆదివారం న‌మోదు అయిన ఓ  మంచి ప‌రిణామం. ఇప్పుడు వైద్యుడూ దేవుడూ ఒక్క‌రే అని బాధితులు చేతులెత్తి ఆయ‌న‌కు మొక్కుతున్నారు.
Tags:    

Similar News