సంచలనం: మతం మారిన హత్రాస్ బాధితురాలి సామాజికవర్గం సభ్యులు

Update: 2020-10-21 16:30 GMT
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ బాలిక గ్యాంగ్ రేపు కేసులో బాధిత కుటుంబానికి చెందిన సామాజికవర్గం సభ్యులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధిత కుటుంబానికి చెందిన సామాజికవర్గాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అగ్ర కులాలు టార్గెట్ చేయడం.. సామాజికంగా వెలివేయడం లాంటి ఘటనలు చోటుచేసుకోవడం.. కులాల వారీగా విడిపోవడంతో హత్రాస్ బాధితురాలి సామాజికవర్గం సభ్యులు ఏకంగా మతాన్నే మార్చేశారు.

తాజాగా హత్రాస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాల పట్ల ఆ గ్రామంలోని బాధితురాలి సామాజికవర్గం (వాల్మీకి)కి చెందిన కొంత మంది కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆ గ్రామంలోని 50 కుటుంబాలకు చెందిన 236 మంది ప్రజలు భౌద్ధమతాన్ని స్వీకరించినట్లు సమాచారం.

ఘజియాబాద్లోని కర్హేడా ప్రాంతంలో అక్టోబర్ 14న వాల్మీకి వర్గానికి చెందిన 236మంది ప్రజలందరూ బౌద్ధమతంలోకి మారారు. హత్రాస్ సంఘటనతో తాము బాధపడ్డామని.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని.. నాయకులు, అధికారులు వారి బాధలు వినలేదని కుటుంబాలు ఆరోపించాయి.

సెప్టెంబర్ 14న హత్రాస్ లోని బుల్గాది గ్రామంలో వాల్మీకి వర్గానికి చెందిన బాలికపై సామూహిక అత్యాచారం, హత్య చోటుచేసుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, యూపీలోని దళితులు, ఆ వర్గం వారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. నలుగురు నిందితులను అరెస్ట్ చేసి అలీగఢ్ జైలుకు తరలించారు.
Tags:    

Similar News