చైనాకు తాజా షాక్‌..ఆ స‌ముద్రంలో మ‌న‌ మిస్సైల్!

Update: 2017-08-18 14:30 GMT
క‌ల్పిత వీడియోతో మ‌న‌ల్ని చుల‌క‌న చేసిన చైనాకు భార‌త్ గ‌ట్టి షాక్ ఇచ్చింది. మిగ‌తా దేశాల‌ను బెదిరింపుల‌కు పాల్పడుతున్న చైనాకు అదే రీతిలో షాకిస్తూ మిస్సైల్‌ ను మోహ‌రించింది. బ్రూనై - మలేషియా - ఇండోనేషియా ఫిలిఫ్పెన్స్ - వియత్నాంలకు కలిపి అధికారాలు ఉన్న‌ప్ప‌టికీ...ద‌క్షిణ చైనా స‌ముద్రం త‌మ‌దే అంటున్న చైనాకు దిమ్మ‌తిరిగేలా...అక్క‌డ భార‌త‌దేశం మిస్సైల్‌ ను మోహ‌రించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. బ్ర‌హ్మోస్‌ ను అక్క‌డ మోహ‌రించ‌డం ద్వారా చైనాకు బీపీ పెంచింది.

దౌత్య‌ప‌ర‌మైన విష‌యాల్లో వియ‌త్నాంతో మ‌న దేశానికి సుహృద్భావ సంబంధాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఓడలపై నుంచి ప్రయోగించే అత్యంత‌ శక్తివంతమైన మిస్సైల్స్ బ్రహ్మెస్‌ను మ‌న దేశం నుంచి కొనుగోలు చేయాల‌ని  వియత్నాం ప్ర‌య‌త్నిస్తోంది. అయితే తాజాగా ఈ డీల్‌ కు భార‌త్ ఓకే చేసింది. దీంతో మ‌న ద‌గ్గ‌ర కొనుగోలు చేసిన బ్ర‌హ్మోస్‌ ను త‌న ప‌రిధిలో ద‌క్షిణ చైనా స‌ముద్రంలో వియ‌త్నం మోహ‌రించేందుకు రెడీ అయింది. ఇటీవ‌లి కాలంలో చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న నేప‌థ్యంలో ఈ అమ్మ‌కం జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. ఈ అమ్మ‌కం విష‌య‌మై వియ‌త్నాం ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టికీ భార‌త‌దేశం అధికారికంగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించ‌లేదు.

కాగా, ధ్వని వేగం కంటే రెండున్నర రెట్టు అధిక వేగంతో ప్రయాణించగల సామర్థ్యం  అత్యంత శక్తివంతమైన మిస్సైల్ బ్రహ్మోస్ సొంతం. ప్రపంచదేశాల వద్ద ఉన్న ఈ తరహ మిస్సైల్స్‌లో బ్రహ్మోస్ అత్యాధునికమైన‌ది. ఓడ‌ల‌పై నుంచి ల‌క్ష్యిత ప్ర‌దేశాల‌పై దాడులు చేయ‌డానికి ఉప‌యోగించే ఈ మిస్సైల్ భార‌త‌దేశ స‌త్తాకు గుర్తింపుగా చెప్తారు.
Tags:    

Similar News