విమర్శ మా చెడ్డ చిరాకు పుట్టిస్తుంటుంది. చిన్న విమర్శకే ఇంత ఇబ్బంది ఉంటే.. విజయ్ మాల్యా లాంటి ప్లేబాయ్ బిజినెస్ మ్యాన్ కి ఇంకెంత ఒళ్లు మండుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. తనపై వస్తున్న విమర్శల్ని ఆయన ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నారు. అయ్యగారి భాగోతం ఒక్కొక్కటి బయటపెడుతున్న మీడియా మీద ఆయన ఆగ్రహం తాజాగా ట్విట్టర్ లో ట్వీట్ల రూపంలో బయటకు వచ్చింది.
ఈ సందర్భంగా కొందరు మీడియా అధినేతలకు తాను చేసిన సాయం గురించి ఆయన ప్రస్తావించారు. గతంలో మీడియా అధిపతులకు తాను చేసిన సాయం.. ఫేవర్స్ ను మర్చి పోయినట్లున్నారంటూ అక్కసు వెళ్లగక్కిన మాల్యా.. మీడియా అధినేతలు తనను ఉద్దేశ్యపూర్వకంగా డీఫేమ్ చేస్తున్నట్లు ఆరోపించారు. ఏళ్ల తరబడి తాను చేసిన ఫేవర్స్ కు సంబంధించి ఆధారాలు డాక్యుమెంట్ల రూపంలో ఉన్నాయంటూ బాంబు పేల్చారు. టీఆర్పీ రేటింగ్స్ కోసం ఇప్పుడు అబద్ధాలు చెబుతారా? అంటూ మీడియాపై మండిపడ్డారు.
మీడియా భూతం ఒక్కసారి వెంటపడటం మొదలైతే.. అది కొనసాగుతూనే ఉంటుందని.. నిజాన్ని చంపేసి బూడిద చేసేంత తీవ్రంగా ఉంటుందన్న మాల్యా.. టైమ్స్ నౌ ఎడిటర్ పై నిప్పులు చెరిగారు. తనపై తప్పుడు కథనాలు ఇస్తున్న సదరు ఛానల్ సంపాదకుడ్ని జైల్లో ఉంచాలని.. జైలు భోజనం తినిపించాలంటూ మాల్యా ట్వీట్లు చేయటం గమనార్హం.