బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులుగా తీసుకుని, ఎగనామం పెట్టి విదేశాలకు చెక్కేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా ఆస్తుల జప్తునకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ఇప్పటికే రెండు జప్తు ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఫామ్ హౌస్ లు, ఫ్లాట్స్, ఎఫ్.డీ.లుసహా రూ.6,630 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్న సంగతి తెలిసిందే. దీనితో ఈ కేసుకు సంబంధించి మొత్తం ఈడీ జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.8,041 కోట్లకు చేరింది. ఈ సంగతి ఇలా ఉంటే.. తాజాగా మాల్యా విల్లా ఒకటి వేలం వేయాలని నిర్ణయించుకుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాప్ ట్రస్టీ.
కాండోలిమ్ బీచ్ లోని 12, 350 చ.మీ విస్తీర్ణమున్న విజయ్ మాల్యా ప్రసిద్ధ విల్లాను వేలం వేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఈమేరకు ఈ విల్లాను సుమారు రూ. 85కోట్లకు వేలం వేయాలని ఎస్.బి.ఐ. క్యాప్ ట్రస్టీ నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్ 19 తేదీని వేలానికి ముహూర్తంగా నిర్ణయించారు. విజయ్ మాల్యా గోవా వచ్చినప్పుడు ఈ అత్యంత విలాసవంతమైన ఈ విల్లాలోనే బస చేసి ప్రముఖులతో విందు చేసుకునేవాడు. అత్యాధునిక సదుపాయాలతో బీచ్ ఒడ్డున కొలువు దీరిన ఈ భారీ విల్లా విలువ సుమారు రూ.90 కోట్లు ఉంటుందని అంచనా. ఈ విల్లాను వేలంలో దక్కించుకునే ముందు ఒక సారి చెక్ చేసుకోవాలనుకునే వారు సెప్టెంబర్ 26 - 27 - అక్టోబర్ 5 - 6 తేదీలలో సందర్శించవచ్చు.
కాగా సుమారు తొమ్మిదివేల కోట్ల రుణ బకాయిలు ఎగవేసి లండన్ కు పారిపోయిన మాల్యాకు సంబందించిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ వివాదంలో ఈ విల్లాను ఎస్ బీఐ క్యాప్ ట్రస్టీ ఎటాచ్ చేసింది. ఇదే సమయంలో తాజాగా స్పందించిన మాల్యా తనకు భారత్ కు రావాలని ఉందని పేర్కొంటూ.. పాస్ పోర్టు రద్దును ఉపసంహరించుకోవాలని కోరిన సంగతి తెలిసిందే.