బ్యాంకుల దగ్గర భారీగా అప్పులు తీర్చుకొని.. వాటిని చెల్లించకుండా చెప్పాపెట్టకుండా విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సంగతి అందరికి తెలిసిన వ్యవహారమే. బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పుల్ని తిరిగి చెల్లించేందుకు రకరకాల కథలు పడిన మాల్యా.. అధికారుల తీసుకుంటున్న చర్యలతో దిగి వస్తున్నాడు. బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.9 వేల కోట్లకు.. తొలుత రూ.4 వేల కోట్లు చెల్లిస్తానని సుప్రీంకోర్టులో ప్రపోజల్ పెట్టగా అందుకు నో అనటం తెలిసిందే. కట్టాల్సిన అప్పు సరే.. ముందు ఆస్తుల వివరాలు వెల్లడించాలని చెప్పటంతో మాల్యా నోటి నుంచి మాట రాని పరిస్థితి.
ఇదిలా ఉంటే ఐడీబీఐ కేసులో కోర్టు ముందుకు హాజరు కావాల్సి ఉన్నా.. మాల్యా హాజరు కాని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాల్యా పాస్ పోర్ట్ ను రద్దు చేయాలన్న ఆలోచన తెర మీదకు వచ్చింది. అదే పని కానీ ఈడీ చేస్తే తనకు మరిన్ని సమస్యలు తప్పవన్న విషయాన్ని మాల్యా గుర్తించినట్లున్నారు.
అందుకే.. ఈ విషయాన్ని తెగే వరకూ లాగకూడదన్న ఆలోచనలో ఉన్న మాల్యా.. నిన్నటి వరకూ రూ.4 వేల కోట్లు మాత్రమే చెల్లిస్తానని చెప్పిన ఆయన.. ఇప్పుడు అందుకు భిన్నంగా రూ.6 వేల కోట్లు చెల్లిస్తానని చెబుతున్నాడు. మరి.. మాల్యా తాజా ఆఫర్ మీద కోర్టు.. ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.