సుద్దపూసనని చెబుతున్న లిక్కర్ ‘కింగ్’

Update: 2016-03-07 06:49 GMT
వినేవాడు ఉంటే చెప్పేవాడు చెలరేగిపోతాడని ఊరికే అనరేమో. వేలాది కోట్ల రూపాయిలు బ్యాంకులకు అప్పు పడిపోవటమే కాదు.. కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తన పొగరమోతుతనాన్ని బయటపెట్టుకున్నాడు. సంపన్నుడికి సహజ సిద్ధంగా ఉంటుందని చెప్పుకునే బరితెగింపు మాటల్ని చెప్పుకొచ్చాడు. కంపెనీలు పెట్టి.. బ్యాంకుల దగ్గర వేల కోట్ల రూపాయిల్ని అప్పులుగా తీసుకొని.. వాటిని తీర్చలేనంటూ చెప్పటమే కాదు.. కంపెనీల్ని అమ్మసి.. తన దారిన తాను లండన్ వెళ్లిపోతానంటూ చెబుతున్న ఆయన.. తాజాగా మరో ఆసక్తికర వ్యాఖ్య చేశాడు.

తమ దగ్గర తీసుకున్న అప్పుల్ని చెల్లించటంలో విఫలమైన విజయ్ మాల్యాను అరెస్ట్ చేయాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల డెబిట్ రికవరీ ట్రైబ్యునల్ లో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టి.. కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో ఆయన సంచలన ప్రకటన చేశారు.

తాను తీసుకున్న అప్పు వ్యక్తిగతం కాదని.. తాను అసలు రుణఎగవేత దారుడ్ని అంతకంటే కాదని చెబుతూ.. తనను డిఫాల్టర్ అని ఎలా అంటారని ఎదురు ప్రశ్నిస్తున్న వైఖరిబ ఇప్పుడు చర్చనీయాంశ:గా మారింది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో.. తాను వ్యక్తిగతంగా రుణం తీసుకోనప్పుడు.. తాను రుణ గ్రహీతను ఎలా అవుతానని ఆయన  ప్రశ్నిస్తున్నారు. డెబిట్ రికవరీ ట్రైబ్యున్ తీర్పు నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ లెక్కన కంపెనీ పెట్టేసి ఎవడికి వాడు బ్యాంకుల దగ్గర అప్పు తీసుకొని ఎగ్గొట్టేస్తే ఫర్లేదన్న మాట. ఇలాంటి బరితెగింపు మాటలు వస్తున్న లిక్కర్ కింగ్ విషయంలో చట్టం తన పని తాను కచ్ఛితంగా చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News