బ్యాంకుల్ని వేల కోట్లకు బురిడీ కొట్టించేసి ఎంచక్కా బ్రిటన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. చాన్నాళ్ల తర్వాత మీడియాలో కనిపించాడు. ఇంగ్లాండ్ లోని సిల్వర్ స్టోన్ ప్రాంతంలో జరుగుతున్న ఫార్ములా వన్ రేసులకు అతిథిగా హాజరయ్యాడు. మాల్యా సహారా ఫోర్స్ ఇండియా ఫార్ములావన్ జట్టుకు సహ యజమాని అన్న సంగతి తెలిసిందే. బ్రిటన్ కు పారిపోయాక ఇంటిపట్టునే ఉంటూ.. తాను ఎక్కడున్నది కూడా తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతూ వస్తున్న మాల్యా.. అనూహ్యంగా ఫార్ములా వన్ రేసుకు హాజరవడం అందరిలోనూ ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. ఐతే బ్రిటన్లో ఉన్నంత వరకు తనకొచ్చిన ఇబ్బందేమీ లేదని అర్థం చేసుకుని తనకిష్టమైన ఫార్ములా వన్ రేసుకు హాజరయ్యాడు మాల్యా. వేల కోట్లు ఎగ్గొట్టి.. ఎంత దర్జాగా ఫార్ములావన్ రేసుకు వచ్చాడో చూడండి అంటూ మాల్యా గురించి తెలిసినవాళ్లంతా మాట్లాడుకున్నారక్కడ.
ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రేసింగ్ అంటే తనకెంతో ఇష్టమని.. కార్లంటే మోజని.. అందుకే ఫార్ములా వన్ జట్టును కొని మంచి పొజిషన్ కు తీసుకొచ్చానని మాల్యా పేర్కొన్నాడు. తాను వారంలో ఆరు రోజులు పని చేస్తూ కొంత బరువు తగ్గానని.. తానిప్పుడు చాలా ఫిట్ గా ఉన్నానని చెప్పాడు. ఏం జరిగినా జీవితం అనేది సాగిపోతూ ఉండాలంటూ తన చుట్టూ నెలకొన్న వివాదాల్ని ఉద్దేశించి వేదాంత ధోరణిలో మాట్లాడాడు మాల్యా. భారత ప్రభుత్వం తన పాస్ పోర్టు రద్దు చేయడంపై స్పందిస్తూ.. ‘‘ఇంతటితో ప్రపంచం ముగిసిపోయినట్లు కాదు. నేనిక్కడి నివాసినే. 1992 నుంచి నేను ఈ దేశం బయట ఉన్నా. ఇది నాకు తెలిసిన ప్రాంతమే. నేనేమీ మరో గ్రహంలో లేను’’ అంటూ తనకేదో బ్రిటన్ పుట్టిల్లు అయినట్లు మాట్లాడాడు మాల్యా.