విలాస పురుషుడు దేశంలోని బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి లండన్ లో తలదాచుకుంటున్న లిక్కర్ బారన్ విజయ్ మాల్యాలోని కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే అప్పుల విషయంలో తన తప్పేమి లేదని షాకిచ్చిన మాల్యా ఇపుడు తనలోని సుఖ పురుషుడిగా లండన్ లో అఫిషియల్ గా తెరమీదకు రానున్నారు. ఫార్ములావన్ రేస్ ల పోటీల సందర్భంగా మాల్యా ప్రెస్మీట్లో స్పందించనున్నారు.
ఫార్ములావన్ బ్రిటిష్ గ్రాండ్ ప్రి సందర్భంగా తన టీమ్ ఫోర్సిండియా తరఫున రేపు జరిగే ఓ ఈవెంట్ కు మాల్యా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మిగతా టీమ్ ఓనర్లతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. అప్పుల బాధతో జంపయిన తర్వాత బహిరంగ దర్శనం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ సీజన్ లో తొలిసారి మాల్యా తన ఫోర్సిండియా టీమ్ ను కలవబోతున్నారు. ఇదిలాఉండగా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి దేశం విడిచి పారిపోయిన మాల్యా కష్టాల్లో ఉన్నప్పటికీ...ఆయన టీమ్ మాత్రం ఈ సీజన్లో బాగానే చేస్తోంది. ఫోర్సిండియా కార్ల తయారీ కంపెనీ.. బ్రిటిష్ గ్రాండ్ ప్రి సర్క్యూట్ కు కూతవేటు దూరంలోనే ఉండటంతో ఈ గ్రాండ్ ప్రిని హోమ్ రేస్ గా భావిస్తోంది.