ప్రజల్ని ఇట్టే కనెక్ట్ అయ్యే పాయింట్లు పట్టుకొని అదే పనిగా చంద్రబాబుపై టార్గెట్ చేసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయి రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. బాబు పాలనా విధానాల్ని నిశితంగా పరిశీలిస్తూ.. ఎప్పటికప్పుడు కడిగిపారేసేలా ట్వీట్లు చేసే విజయసాయి తాజాగా.. బాబు సర్కారు తీసుకున్న ఒక నిర్ణయాన్ని తప్పు పడుతూ విమర్శలు చేశారు.
రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గా దాసరి రాజా జీతభత్యాల్ని ఒక్కసారిగా పెంచుతూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని విజయసాయి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జీతభత్యాల్ని రూ.50వేల నుంచి రూ.2లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం నీతిమాలిన చర్య కాదా? అని ఆయన క్వశ్చన్ చేశారు.
ఏప్రిల్ 19న ఇచ్చిన ఉత్తర్వుల్లో బకాయిలు రూ.24లక్షలు చెల్లించాలని ఆదేశించారని.. మీ హెరిటేజ్ కంపెనీలో అయితే ఇలా 200శాతం పెంచుతారా? అంటూ సూటిగా ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుతో సంబంధం లేకుండా ఫోని తుపాను సహాయక పనులు జరగటంపై ప్రభుత్వ యంత్రాంగంపై బురదజల్లేలా వార్తల్ని తమ అనుకూల మీడియాతో కుమ్మరిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
శ్రీకాకుళం జిల్లా శిబిరాల్లో ఉన్న ప్రజలకు భోజన వసతి సరిగా లేదని గొట్టాలు పెట్టి గోల చేస్తున్నారు.. టీడీపీ కార్యకర్తలతో తిట్టిపోయిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. అదే పనిగా ఎన్నికల్లో తమదే ఘనవిజయమని చెబుతున్న చంద్రబాబు మాటల పరమార్థాన్ని విజయసాయి రెడ్డి ట్వీట్ లో ప్రస్తావించారు. అధికారుల్ని బెదిరించటానికి.. కౌంటింగ్ రోజు అక్రమాలకు పాల్పడటానికి వీలుగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఘనవిజయమని బాబు అంటున్నారని.. కానీ ప్రతిపక్ష హోదా దక్కితే గొప్ప అంటూ ఫైర్ అయ్యారు.