విజయ సాయిరెడ్డి కి జగన్ అత్యున్నత పదవి

Update: 2019-06-05 05:29 GMT
విజయసాయిరెడ్డి.. ఈ ఐదేళ్లలో జగన్ కష్టంలో.. సుఖంలో తోడుగా ఉన్నాడు. ప్రత్యర్థులు పన్నిన కుట్రలో .. అక్రమాస్తుల కేసులో  జగన్ తోపాటు అరెస్ట్ అయ్యాడు.    జైలు జీవితం అనుభవించాడు. జగన్ తోడుగా - నీడుగా ఉండి అన్నింటా తానై వ్యవహరించాడు. ఇప్పుడు జగన్ ఏపీలో అధికారంలోకి రావడంతో విజయసాయిరెడ్డికి అత్యున్నత పదవి దక్కుతుందని అంతా ఆశించారు. అనుకున్నట్టే జగన్ చేసేశాడు..

వైసీపీ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేతగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని జగన్ నియమించారు. లోక్ సభలో వైసీపీ పక్షనేతగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి - పార్టీ చీఫ్ విప్ గా మార్గాని భరత్ రామ్ ను ఎంపిక చేశారు. ఈ ముగ్గురిని ఆయా పదవుల్లో నియమిస్తున్న వైసీపీ అధినేత జగన్ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు. వీరి నియామకాలను అధికారికంగా పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

కాగా పార్లమెంటరీ పక్ష నేతకు ఢిల్లీలో ప్రొటోకాల్ ప్రకారం సౌకర్యాలు - ఆయా కేంద్ర పార్లమెంటరీ కమిటీల్లో ఒక చైర్మన్ పదవి సహా చాలా నియామకాల్లో కేంద్రం గుర్తింపు ఉంటుంది. దీంతో విజయసాయిరెడ్డి ఏపీ వ్యవహారాలను ఢిల్లీలో చక్కదిద్దే అవకాశం ఉంటుంది. మొత్తం జగన్ తన నమ్మిన వ్యక్తి కే ఢిల్లీలో వైసీపీ - ఏపీ వ్యవహారాలను అప్పగించడం విశేషం.



Tags:    

Similar News