ప్రస్తుతం ఏపీలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై రాజకీయం వేడెక్కింది. కేంద్రం నిర్ణయాన్ని ఇప్పటికే పలు ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వామపక్షాలు ఉద్యమం మొదలుపెట్టాయి. ఇదిలా ఉంటే రాజకీయపార్టీలు కూడా విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడాన్ని తప్పుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ ఉద్యమం చేస్తుండగా.. బీజేపీ, జనసేన మాత్రం ఇరుకున పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడికీ పోదని.. లాభాల తీసుకొచ్చేందుకే ప్రైవేటీకరిస్తున్నామంటూ కేంద్రం అంటున్నది.
నష్టాల్లో ఉన్న విశాఖను గట్టెక్కించాలంటే ప్రభుత్వ గనులు కేటాయిస్తే సరిపోతుందని .. కానీ కేంద్రం మాత్రం ప్రైవేట్ వ్యక్తులకులాభం చేకూర్చేందుకు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టును ప్రైవేట్‌కు అప్పగిస్తోందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర నిర్ణయంపై సంచలన నిజాలు బయటపెట్టారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం వెనుక ఒడిశాకు చెందిన అధికారులు ఉన్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష కార్మికసంఘాల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం వెనక ఒడిశాకు చెందిన కొందరు అధికారులు ఉన్నారు. కేంద్ర పెద్దలతో కలిసి వాళ్లు కుట్రపన్నారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో ఒడిశాకు చెందిన కొందరు అధికారులు ఉన్నారు. వాళ్ల వల్లే సంస్ధ నష్టాలు చవిచూసింది. అయితే కేంద్ర ఉక్కుశాఖలోనూ ఒడిశాకు చెందిన అధికారులు ఉన్నారు. వాళ్లే ఈ కుట్రకు తెరలేపారు’ అని విజయ్‌సాయిరెడ్డి పేర్కొన్నారు.
గతంలో రాయ్‌బరేలీకి చెందిన రైలు చక్రాల కర్మాగారం కోసం స్టీల్ ప్లాంట్‌కు చెందిన రూ.2 వేల కోట్ల రూపాయలు తీసుకున్నారని, ఒడిశా మైనింగ్ కొర్పొరేషన్‌లో పదేళ్ల క్రితం రూ.381 కోట్లు పెట్టుబడితే పెడితే ఖనిజం రాకపోగా.. వెయ్యికోట్ల పెనాల్టీ కట్టాల్సి వచ్చిందన్నారు. అలాగే ప్లాంట్‌లో టేకే బాండ్ అనే అధికారి రూ.2 వేల కోట్ల స్కాం చేస్తే ఎవరూ పట్టించుకోలేదన్నారు.
ఈ మూడు కారణాల వల్లే స్టీల్ ప్లాంట్ రూ.5361 కోట్లు నష్టపోయిందన్నారు. కేంద్రంలోని పెద్దలు, పారిశ్రామికవేత్తలు, కొందరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అయితే ఈ కుట్రలను తాను కేంద్రమంత్రి అమిత్ షాకు వివరిస్తానని విజయ్‌సాయిరెడ్డి చెప్పారు.