తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గురించి ఒకనాటి ఆయన ఉద్యమ సహచరురాలు - మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికర విశ్లేషణ చేశారు. కశ్మీర్ విభజనతో పాటూ ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనిపై విజయశాంతి కొత్త విశ్లేషణ చేశారు. ఇటు ఎంఐఎంను అటు బీజేపీని కేసీఆర్ మేనేజ్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
``దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని కశ్మీర్ విభజనతో పాటూ ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును సమర్ధిస్తున్నట్లు టీఆరెస్ ఎంపీలు చెప్పారు. తెలంగాణలో ఎంఐఎంతో మైత్రిని కొనసాగిస్తూ...బీజేపీని ప్రత్యర్ధి పార్టీగా భావించే తెలంగాణ సీఎం కేసీఆర్ గారు దేశ భద్రతకు ప్రాధాన్యమిచ్చి - కశ్మీర్ వ్యవహారంలో రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవడం సహేతుకం. కానీ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రధాన పార్టీల అధినేతలను కలిసి - వారిని ఒప్పించే విషయంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ గారు...దేశ సార్వభౌమత్వంతో పాటూ దేశ భద్రతకు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు విషయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గారికి నచ్చజెప్పి - ఆయనను కూడా ఒప్పించి ఉంటే బాగుండేది`` అని ఫేస్ బుక్ లో పేర్కొన్నారు
అందరికీ ఆమోదయోదగ్యమైన రీతిలో రాజ్యాంగబద్ధంగా కశ్మీర్ విభజన అంశంపై పార్లమెంటులో చర్చ జరిగి ఉంటే తాము కూడా అభ్యంతరం తెలిపేవాళ్లం కాదని అసదుద్దీన్ ఒవైసీ లోక్ సభలో చెప్పడం గురించి విజయశాంతి కొత్త విశ్లేషణ చేశారు. `` అన్ని విషయాలపై ఎంఐఎం అధినేతతో మాట్లాడే కేసీఆర్ గారు - దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయంపై ఆయనతో మంతనాలు జరిపి ఎంఐఎం మద్దతును కూడగట్టి ఉంటే తెలంగాణతో పాటూ దేశప్రజలు కూడా హర్షించేవారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ - ఎంఐఎంలు పొత్తుపెట్టుకోనున్న తరుణంలో కశ్మీర్ విభజన బిల్లుకు టీఆర్ ఎస్ మద్దతు తెలపడం ఈ కూటమిపై ప్రభావం చూపవచ్చని కొందరు విశ్లేషకులు చెప్పడం విన్నాను. కానీ ఈ విశ్లేషణలను - వాదనలను నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే అవకాశానికి తగ్గట్లు తమ వైఖరిని ఎలాగైనా మార్చుకోగల సమర్ధత - ప్రజలను ఒప్పించగల చతురత కేసీఆర్ గారికి ఉన్నాయని పలు సందర్భాల్లో రుజువైంది.`` అని తెలిపారు.
కశ్మీర్ విభజన బిల్లుకు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందో అసదుద్దీన్ ఒవైసీకి వివరించి... జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో మళ్లీ పొత్తుకు ఇబ్బంది కలగకుండా కేసీఆర్ గారు పావులు కదపుతారని భావిస్తున్నాను అని విజయశాంతి పేర్కొన్నారు. ఈ వ్యూహాలు ఎత్తులు ఎలా ఉన్నా..తెలంగాణ జనానికి ఇప్పటికే టీఆరెస్ అధినేత వైఖరిపై ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.