టీఆర్ఎస్-ఎంఐఎంది రాజకీయ వ్యూహం: విజయశాంతి

Update: 2020-11-23 05:30 GMT
తెలంగాణ కాంగ్రెస్ లో తెరవెనుక ఉండి రాజకీయం చేస్తున్న రాములమ్మ మరోసారి టీఆర్ఎస్-ఎంఐఎం తాజా కొట్లాటపై స్పందించారు. వారిది రాజకీయ వ్యూహం అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఈ మధ్య సోషల్ మీడియా ద్వారానే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పై, కేసీఆర్, కేటీఆర్ లపై సంచలన వ్యాఖ్యలతో హీట్ పుట్టిస్తున్నారు. దుబ్బాక ఎన్నికల వేళ కూడా కేసీఆర్, హరీష్ రావు మంత్రాంగంపై ఆమె హాట్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ దండు వ్యూహాలను ఎలుగెత్తి చాటుతున్నారు.

ఈ కోవలోనే కేసీఆర్ సర్కార్ ను పడగొడతామన్న ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ ఖాన్ వ్యాఖ్యలపై విజయశాంతి స్పందించారు. ఓట్ల కోసమే వీరిద్దరూ విమర్శలు చేసుకుంటూ క్యాష్ చేసుకుంటున్నారన్నారు. బీజేపీని ఓడించేందుకు ఇలా చేస్తున్నారని విమర్శించారు. మోడీపై యుద్ధం.. టీఆర్ఎస్ -ఎంఐఎం రాజకీయ వ్యూహంలో భాగమని విజయశాంతి ఆరోపించారు.

దేశవ్యాప్తంగా ఎంఐఎం విస్తరణకు టీఆర్ఎస్ నిధులు ఇస్తోందని విజయశాంతి ఆరోపించారు. తద్వారా చాలా రాష్ట్రాల్లో పట్టు ఏర్పరుచుకొని పొత్తుల ద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ భావిస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే జీహెచ్ఎంసీ పోలింగ్ తర్వాత రెండు పార్టీలు కలిసిపోతాయని విజయశాంతి జోస్యం చెప్పారు.
Tags:    

Similar News